హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో.. ఫేక్ నంబర్ ప్లేట్స్ దొరికాయి... మీ బండి కొంచెం చెక్ చేసుకోండి..!

హైదరాబాద్ లోని ఈ ఏరియాల్లో.. ఫేక్ నంబర్ ప్లేట్స్ దొరికాయి... మీ బండి కొంచెం చెక్ చేసుకోండి..!

హైదరాబాద్ లో నకిలీ నంబర్ ప్లేట్స్ పై ఉక్కుపాదం మోపారు ట్రాఫిక్ పోలీసులు. శనివారం ( ఆగస్టు 8 ) సిటీలోని పలు ఏరియాల్లో తనిఖీలు నిర్వహించి ఫేక్ నంబర్ ప్లేట్స్, టాంపర్డ్ నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాల్లో తిరుగుతున్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

సిటీలోని పంజాగుట్ట, చిలకలగూడ, డిండి, కంచన్ బాగ్, బండ్లగూడ ఏరియాల్లో ఫేక్ నంబర్ ప్లేట్స్ తో తిరుగుతున్న 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.నంబర్ ప్లేట్స్ మార్చినా.. అంకెలను దాచినా కఠిన చర్యలు తప్పవని.. HSRP నంబర్ ప్లేట్స్ తప్పనిసరి అని సూచిస్తున్నారు పోలీసులు.

ఫేక్ నంబర్ ప్లేట్స్ వాడితే సహించబోమని... ఎంతటివారైనా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఫేక్ నంబర్ ప్లేట్స్ తో పట్టుబడితే... వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు పోలీసులు.