RTC బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్‌కు ఫిట్స్.. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వస్తుండగా ఘటన

RTC బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్‌కు ఫిట్స్.. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వస్తుండగా ఘటన

కామారెడ్డి: RTC బస్సు రన్నింగ్లో ఉండగా డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చిన ఘటన ప్రయాణికులను కంగారు పెట్టింది. కామారెడ్డి నుంచి సిరిసిల్ల వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో రన్నింగ్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. గొల్లపల్లి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ చక్రపాణి అకస్మాత్తుగా అస్వస్థతకు లోనయ్యాడు. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును సురక్షితంగా పక్కన ఆపాడు. బస్సులోని ప్రయాణికులను డ్రైవర్ వెంటనే కిందికి దించేశాడు.

డ్రైవర్ అప్రమత్తత ప్రయాణికుల ప్రాణాలను కాపాడింది. అనంతరం రోడ్డుపైనే డ్రైవర్ కొద్దిసేపు సేద తీరగా.. చికిత్స నిమిత్తం అతనిని ఎల్లారెడ్డిపేట అశ్విని ఆసుపత్రికి డ్రైవర్ తరలించారు. డ్రైవర్ సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు. డ్రైవర్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉండటం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని RTC సిబ్బంది వాపోతున్నారు. సరిపడా విశ్రాంతి లేకపోవటం, వరుసగా డ్యూటీలు వేస్తుండటంతో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని RTC ఉద్యోగులు చెబుతున్నారు.