గడచిన 4 రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. గ్రాముకు దాదాపు రూ.800 పైగా పెరగటంతో రిటైల్ కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. త్వరలోనే గ్రాము ధర రూ.16వేలను టచ్ కావొచ్చని ఈ దూడుకు చూస్తుంటే అనిపిస్తోందని వాపోతున్నారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులే బులియన్ మార్కెట్లలో జోరుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వీకెండ్ షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ సమీప నగరాల్లోని తాజా ధరలను పరిశీలించండి.
ఆగస్టు 8న బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఆగస్టు 7 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.109 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 235గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 965గా కొనసాగుతోంది.
ALSO READ : డిజిటల్ కొనుగోళ్లకు.. ఎంఎస్ఎంఈలు రెడీ
శనివారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఆగస్టు 8, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి ఎలాంటి మార్పు లేకుండా రూ.2లక్షల 50వేలుగా ఉంది. అంటే గ్రాము దాదాపు రూ.250 దగ్గర ఉంది.
