హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవ శాత్తు లోయలో పడింది. శనివారం(ఆగస్టు8) ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా తిస్సా, బైరాగడ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో డ్రైవర్, కండక్టర్ కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. బస్సు బైరాగఢ్ నుంచి చంబా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.
