జ్యోతిష్యం: కుంభరాశిలో అద్భుతం.. రాహువు .. చంద్రుడు కలయిక .. గ్రహణ యోగం.. ఎవరికి ఎలా ఉంటుంది..!

జ్యోతిష్యం: కుంభరాశిలో అద్భుతం.. రాహువు .. చంద్రుడు కలయిక .. గ్రహణ యోగం.. ఎవరికి ఎలా ఉంటుంది..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో చంద్రుడి స్థానం శుభకరంగా ఉన్నప్పుడు వ్యక్తికి మానసిక ప్రశాంతత, సకల సుఖాలు లభిస్తాయి. . మనస్కారకుడైన చంద్రుడు  సెప్టెంబర్​ 23న ఉదయం 11 గంటల 33 నిమిషాలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.  అయితే ఇప్పటికే ఉన్న రాహువుతో కలిసి తన సంచరించడంతో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణ యోగం ఏర్పడుతుంది.  ఈ ప్రభావం 12 రాశులపై ఉన్నప్పటికి మూడు రాశుల ( మేష, కన్య,ధనస్సు) వారికి అదృష్టం వరించనుంది.  గ్రహణ యోగ ప్రభావంతో ఏ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . ! 

మేష రాశి :  కుంభరాశిలో రాహువు.. చంద్రుడు కలయిక.. గ్రహణ యోగం వలన ఈ రాశి వారికి అదృష్టయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  ఇంటా బయటా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. . జీవితంలో సానుకూల మార్పులను స్పష్టంగా గమనించే అవకాశం ఉంది.  చేపట్టిన ప్రతి పనిలో కూడా ఎంతో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. ఆర్థిక అవకాశాలు బలపడతాయి. ఊహించని మార్గాల ద్వారా కూడా సంపద కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఘన విజయాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగరీత్యా విదేశీయానానికి అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలకు, విదేశాల్లో స్థిరపడడానికి సంబంధించిన ఎటువంటి ప్రయత్నమైనా తప్పకుండా నెరవేరుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వృషభరాశి : కుంభరాశిలో గ్రహణ యోగ్ ఏర్పడటం వలర ఈ రాశి  వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు అప్రమ‌త్తంగా ఉండాలి.    ఖ‌ర్చులు కూడా పెరుగుతాయి. స‌మాజంలో గౌర‌వం ల‌భిస్తుంది.  వ్యాపార‌స్తులు కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేవిష‌యాన్ని వాయిదా మంచిది . త‌గిన జాగ్రత్తలు తీసుకోక‌పోతే పెట్టుబ‌డి పెట్టిన సొమ్ము న‌ష్టపోయే అవ‌కాశం ఉంది.  ఉద్యోగ‌స్తులు కొత్త ప్రాజెక్టులు... కొత్త బాధ్యత‌లు తీసుకొనే అవ‌కాశం క‌ల‌దు.  ఆదాయం పెరుగుతుంది.. ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. ప్రేమ విష‌యాలు కూడా వాయిదా వేయడం  వేసుకోవ‌డం  మంచిద‌ని పండితులు సూచిస్తున్నారు. 

మిథునరాశి :గ్రహణ యోగం వలన  ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి.  అనుకున్న పనులు కొంచెం నిదానంగా పూర్తవుతాయి.  ఉద్యోగస్తులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.  ఖర్చులు పెరుగుతాయి.  కెరీర్​ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  నిరుద్యోగులకు జాబ్​ ఆఫర్లు వస్తాయి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు కష్ట పడాల్సి ఉంటుంది.   కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు.  ఆన్​ లైన్​ ట్రాన్సాక్షన్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి.  తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. 

కర్కాటకరాశి : గ్రహణయోగం కుంభరాశిలో ఏర్పడటం వలన ఈ రాశి వారికి  ప్రతి విషయం ఛాలెంజ్‌గా ఉంటుంది.  వ్యాపారం కూడా కొన్ని మార్పులు వస్తాయి. ఉద్యోగస్తులు అనవరంగా మాట పడతారు.  అందరిని గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల మ‌ధ్య వివాదాలు ఏర్పడుతాయి.  ఆస్తుల మ‌ధ్య వివాదాలు వ‌స్తాయి.   ముఖ్యంగా మానసికంగా, శారీరకంగా అనేక సమస్యలు పెరుగుతాయి. మీ కుటుంబంలో కలహాల వల్ల సంతోషం ఉండదు. స్థిరాస్తులకు సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. 


సింహ రాశి :  కుంభరాశిలో రాహువు..చంద్రుడు కలవడంతో ఏర్పడే గ్రహణ యోగం  ప్రభావం వలన ఈ  రాశి వారికి ఖర్చులు, పని  భారం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయంలో అనవసరంగా అవమానాలు పడతారు. తోటి ఉద్యోగులు వలన సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఇతరులతో మాట్లడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండంది. చిన్న విషయం వివాదంగా మారే అవకాశం ఉంది. ఎవరికి హామీ ఉండవద్దు.  వ్యాపారస్తులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు.  

కన్యారాశి:  గ్రహణ యోగం వలన ఈ రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.అనుకున్న పనులు నెరవేరుతాయి.  సానుకూల శక్తిని పెరిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది.  వీరు తల పెట్టిన పనులు  సులభంగా పూర్తవుతాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది.   సంతానం కోసం ఎదురు చూసే వారు శుభ‌వార్త వింటారు.  వ్యాపార‌స్తుల‌కు అధికంగా లాభాలు వ‌స్తాయి.  కొత్తగా పెట్టుబ‌డులు పెట్టేందుకు  చాలా అనుకూలంగా ఉంది.  కొత్తగా ఇల్లు క‌ట్టేందుకు అంకురార్పణ చేసే అవ‌కాశం ఉంది. ఉద్యోగ‌స్తులకు ప‌నిభారం అధిక‌మ‌వుతుంది.  స‌హోద్యోగ‌ల అండ‌దండ‌లు ఉంటాయి.  మీ బాస్ మీకు కొన్ని కీల‌క‌మైన ప‌నులు అప్పగించే అవ‌కాశం ఉంటుంది.  ఇది మీ లైఫ్ న‌కు ట‌ర్నింగ్ పాయింట్ కూడా అవ్వవ‌చ్చు. కాబ‌ట్టి అద‌న‌పు బాధ్యత‌ల‌ను ఇష్టంగా స్వీక‌రించండి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

తులా రాశి :   గ్రహణ యోగం వలన ఈ రాశి వారికి ఊహించని మార్పులు కలుగుతాయి.  వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులకు అద్భుతమైన పెట్టుబడులు వస్తాయి.  గతంలో పోగొట్టుకున్న డబ్బును ఈ సమయంలో తిరిగి పొందుతారు. వ్యాపారస్తులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వస్తుంది.  ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.   వ్యాపారస్తులకు.. ఉద్యోగస్తులకు.. చేతి వృత్తుల వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.  ఉద్యోగస్తులు  కార్యాలయంలో  కీలకపాత్ర పోషించడంతో పాటు ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటారు.  . గతంలో పడిన ఇబ్బందులకు పరిష్కారం లభిస్తుంది

వృశ్చికరాశి : కుంభరాశిలో గ్రహణ యోగం వలన ఈ రాశికి చెందిన  యజమాని కుటుంబసభ్యులు అందరి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతిపనిలో కూడా ఒత్తిడి ఎదుర్కొంటారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులు.. స్నేహితుల వలన  సమస్యలు వస్తాయి.  మీ మాటలను నియంత్రించుకోవడం చాలా అవసరం.  ఎట్టి పరిస్థితిలో  ఎవరికి అప్పు ఇవ్వవద్దు. అశాంతితో నిద్ర లేకుండా గడిపాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు మీ పని మీరు చేసుకోండి.   ప్రతి విషయంలో ఓర్పు .. సహనం చాలా అవసరం. కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది.ఎట్టి పరిస్థితిలో ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దని పండితులు చెబుతున్నారు. 

ధనుస్సు రాశి: గ్రహణ యోగం వలన ఈ రాశి వారి జీవితంలో గణనీయమైన మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.  కష్టానికి తగిన ఫలితం ఉంటుంది.  ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా రాకుండా నిలిచిపోయిన బకాయిలు లేదా డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేయడం, ఇల్లు నిర్మించడం లేదా గృహ మరమ్మతులు చేపట్టడం వంటి పనులకు ఇది సరైన సమయం. కుటుంబ సంబంధాలు మరింత బలపడతాయి.ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు లభిస్తాయి.  ఉద్యోగ‌స్తుల‌కు ప్రమోష‌న్ తో వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంది.  కేరీర్ లో ఉన్నత‌స్థానాన్ని పొందుతారు.  ఇప్పటి వ‌ర‌కు మిమ్మల‌ను వ్యతిరేకించిన వారే మీ స‌హాయాన్ని అర్దిస్తారు.  ఆక‌స్మికంగా ధ‌న‌లాభం పొందుతారు. ప్రేమ‌.. పెళ్లి మొద‌ల‌గు అంశాలు క‌ల‌సి వ‌స్తాయి. 

మకరరాశి : గ్రహణయోగం వలన కుంభ రాశిలో రాహువు.. చంద్రుడు కలిసి సంచరించడం వలన ఈ రాశి వారికి కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు చాలా ఓపికకగా ఉండాలి.  ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అనవసరమైన విషయాల జోలికి వెళ్లవద్దు.  ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి.  ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు.  ఆరోగ్య పరంగా కూడా సమస్యలు ఉంటాయి.  ఉద్యోగస్తులు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని పండితులు సూచిస్తున్నారు..

కుంభ రాశి : ఇదే రాశిలో రాహువు.. చంద్రుడు కలిసి గ్రహణ యోగం ఏర్పడటం వలన ఈ రాశికి చెందిన  వ్యాపారస్థులకు.. ఉద్యోగస్తులకు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది ఆఫీసులో  కష్టపడి పనిచేసినా ఫలితం రాదు. తోటి ఉద్యోగుల సహకారం లేకపోవడంతో కొన్ని అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే సాగుతాయి. పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో చాలా  జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితిలో కీలక  ఒప్పందాలు చేసుకోవద్దు.  ఆర్థిక విషయాలకు సంబంధించి ఆందోళన పెరిగే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించడం చాలా మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 


మీనరాశి: కుంభరాశిలో చంద్రుడు –-రాహువుల కలయిక వలన  ఈరాశి వారికి ఉత్సాహం పెరుగుతుంది.  మీ ప్రణాళికలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. మీరు తీసుకొనే వ్యూహాత్మక నిర్ణయాలు  అనుకూలంగా ఉంటాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయ వృద్ధి ప్రయత్నాలు కూడా నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఆర్థిక సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించడం చాలా మంచిది. వీరికి అనారోగ్యానికి తగ్గ సరైన చికిత్స లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.