వర్షాకాలంలో ఎండాకాలం మాదిరి జనం అల్లాడిపోతున్నారు.. వర్షాలు లేక రైతులు విలవిలలాడుతున్నారు.. ఇలాంటి సమయంలో చల్లని కబురు. బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చేసింది. దానికి ఆర్నబ్ అని పేరు పెట్టారు వాతావరణ శాఖ అధికారులు. ఒరిస్సా, ఆంధ్ర మధ్య ఏర్పడిన ఈ తుఫాన్.. మరింత బలపడి.. పెను తుఫాన్ గా మారే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. తుఫాన్ అంటే భయపడే జనం.. ఈసారి మాత్రం తుఫాన్ అంటే హ్యాపీగా ఫీలవుతున్నారు. వర్షాలు పడతాయి.. నీళ్ల కష్టాలు తీరతాయి అని హ్యాపీగా ఉన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతంర ఏపీలోని గోపాల్‌పూర్, కళింగపట్నం, విశాఖపట్నానికి సమీపంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం.. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, సెప్టెంబర్ 23 రాత్రి నుంచి సెప్టెంబర్ 24 తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య ఉత్తర ఆంధ్రప్రదేశ్ - దక్షిణ ఒడిశా తీరాలను దాటే అవకాశం ఉంది. ఒకవేళ ఇది తుఫానుగా బలపడితే, దీనికి బంగ్లాదేశ్ సూచించిన 'అర్నాబ్' అనే పేరు పెట్టనున్నారు. అర్నబ్ అంటే (బెంగాలీలో దీని అర్థం సముద్రం) అనే పేరును బంగ్లాదేశ్ సూచించింది.
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. రానున్న రెండు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశం ఉండటంతో పాటు, గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒడిశాలోని పలు జిల్లాల్లో పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Satellite animation of #Depression over Westcentral & adjoining Northwest Bay of Bengal https://t.co/OyAVTphcgr
— India Meteorological Department (@Indiametdept) September 22, 2026
