మీకు 28 ఏళ్లు దాటాయా ? మీ పుట్టిన తేదీలో ఈ నంబర్ ఉందా ? అయితే అదృష్టం పట్టబోతోంది !

మీకు 28 ఏళ్లు దాటాయా ? మీ పుట్టిన తేదీలో ఈ నంబర్ ఉందా ?  అయితే  అదృష్టం పట్టబోతోంది !

న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 7వ సంఖ్యను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఏ నెలలోనైనా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి రాడిక్స్ నంబర్ (పుట్టిన తేది మొత్తం) 7 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి కేతువు. 7వ నంబర్ ఉన్నవారి జీవితంలో మొదట్లో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఒక నిర్దిష్ట వయస్సు దాటాక డబ్బు వారిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. వారి జీవితాన్ని మలుపు తిప్పే ఆ ఏజ్ ఏంటో, వారి ప్రత్యేకతలు ఏంటో వివరంగా చూద్దాం!

జీవితంలో కీలక మలుపు 
28 నుండి 35 ఏళ్ల మధ్య కాలం: 7వ సంఖ్య ఉన్నవారికి 28 నుండి 35 సంవత్సరాల వయస్సు అనేది లైఫ్‌లో బిగ్ టర్నింగ్ పాయింట్. ఈ సమయంలో వీరి కెరీర్, ఆర్థిక పరిస్థితి ఊహించని మలుపు తిరుగుతుంది.

ముఖ్యంగా 32 ఏళ్లు దాటిన తర్వాత వీరు వాళ్ళ నిజమైన ప్రతిభను పసిగట్టి సరిగ్గా నిలదొక్కుకుంటారు. ఈ వయస్సు తర్వాత వీరికి అనుకోని ధన లాభాలు, ఆకస్మిక సంపద లభించే అవకాశాలు చాలా ఎక్కువ.

7వ సంఖ్య ఉన్నవారి అసలు స్వభావం ?
లోతైన ఆలోచనాపరులు: వీరు ఏ విషయాన్నైనా పైన పైన చూడరు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. కేవలం మాటలను నమ్మకుండా నిజాన్ని అన్వేషిస్తారు.

వీరికి అంతర్దృష్టి  చాలా ఎక్కువ. ముందు ఏం జరగబోతుందో ఊహించగల శక్తి ఉంటుంది. అంతేకాకుండా, ఆధ్యాత్మికత వైపు వీరికి ఆకర్షణ ఎక్కువ.

వీరు స్వభావం పరంగా చాలా ఎమోషనల్. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల జీవితంలో ఎక్కువగా మోసపోవడం లేదా ద్రోహానికి గురికావడం జరుగుతుంటుంది.

డబ్బు సంపాదనలో వీరి స్టైల్ వేరు 
 వీరు పుట్టుకతోనే కోటీశ్వరులు కాకపోవచ్చు. జీవితంలో మొదట చాలా కష్టాలు, డబ్బు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీరు షార్ట్‌కట్ మార్గాల్లో లేదా అక్రమంగా డబ్బు సంపాదించడానికి అస్సలు ఇష్టపడరు. కానీ సొంత కష్టం, తెలివితేటలపైనే ఆధారపడతారు.

 వీరు ఒకేసారి పది పనులు చేయరు. ఏదో ఒక రంగాన్ని ఎంచుకుని, అందులో ఎక్స్పర్ట్ అవుతారు. ఈ స్పెషలైజేషన్ వల్ల వీరికి భవిష్యత్తులో విపరీతమైన గుర్తింపు, కోట్ల సంపద లభిస్తాయి.

మీ పుట్టిన తేదీ కూడా 7, 16 లేదా 25 అయితే.. ఓపిక పట్టండి... మీ గోల్డెన్  టైమ్ త్వరలోనే రాబోతోంది!

 Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారంతో పండితుల సలహాలను  వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  సమస్యలకు  నిపుణులను సంప్రదించటం ఉత్తమం.