గిన్నిస్ వరల్డ్ రికార్డులో 'రాకా'.. మోషన్ క్యాప్చర్‌లో అల్లు అర్జున్, అట్లీ కాంబో విధ్వంసం!

గిన్నిస్ వరల్డ్ రికార్డులో 'రాకా'.. మోషన్ క్యాప్చర్‌లో అల్లు అర్జున్, అట్లీ కాంబో  విధ్వంసం!

ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరూ ఊహించని సరికొత్త చరిత్రను తిరగరాశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'రాకా' (Raaka) . విడుదలకు ముందే ఈ మూవీ గ్లోబల్ లెవెల్‌లో సంచలనం సృష్టిస్తోంది. దీంతో  ఫ్యాన్స్, సినీ ట్రేడ్ వర్గాల అంచనాలను మరింత రెట్టింపు చేస్తోంది.

లేటెస్ట్ గా ఈ సినిమా గిన్నిస్ వరల్డ్ రికార్డు (Guinness World Record) సాధించి ట్రేడ్ వర్గాలను మైండ్ బ్లాక్ చేసింది. రియల్ టైమ్ 'మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ' (Motion Capture Technology) ఉపయోగించి ఒకేసారి అత్యధికంగా 37 మందిని విజువల్ ఎఫెక్ట్స్‌లో చిత్రీకరించి ఈ అరుదైన ఫీట్ సాధించింది. గతంలో 19 మందితో ఉన్న రికార్డును 'రాకా' టీమ్ తిరగరాసింది. దీనికి సంబంధించిన ప్రత్యేక మేకింగ్ వీడియోను సన్ పిక్చర్స్ విడుదల చేయగా, సాయి అభ్యంకర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కూడిన ఆ విజువల్స్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

 

ఇక సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ 39వ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా (X) వేదికగా స్పెషల్ విష్ చేశారు. అట్లీ విజన్, మేకింగ్ స్టైల్‌ను ఆకాశానికెత్తుతూ.. 'మీతో కలసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉంది. మన కాంబోలో మరిన్ని అద్భుతాలు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నా' అని ట్వీట్ చేశారు.

సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌లో దీపికా పదుకొనే, రష్మిక మందన్నా, జాన్వీ కపూర్, మృణాళ్ ఠాకూర్ వంటి టాప్ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లతో తెరకెక్కుతున్న ఈ 'దివ్య యోధుడు' (Divine Warrior) కథ ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై ఏ రేంజ్‌కు తీసుకెళ్తుందో చూడాలి.