ప్రసిడెంట్ ట్రంప్ వార్తలు ప్రసారం చేయం.. అమెరికాలో ప్రముఖ టీవీ చానెల్స్ ప్రకటన

ప్రసిడెంట్ ట్రంప్ వార్తలు ప్రసారం చేయం.. అమెరికాలో ప్రముఖ టీవీ చానెల్స్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తలు ప్రసారం చేయకూడదని నిర్ణయించుకున్నాయి అమెరికాలోని పలు కీలక టీవీ ఛానెళ్లు. సీఎన్‌ఎన్, ఎంఎస్ నౌ, పాలిటికో వంటి మీడియా సంస్థలకు వైట్ హౌస్‌లోకి ప్రవేశం నిషేధించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు ఉమ్మడిగా వైట్ హౌస్ కవరేజ్‌ను నిలిపివేశాయి. దీంతో అధ్యక్షుడి ప్రజా కార్యక్రమాల వీడియోకు సంబంధించి కవరేజ్‌లో గ్యాప్ ఏర్పడింది.

2026 సెప్టెంబర్ 21న ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి టీవీ చానెళ్లు. వైట్ హౌస్ టెలివిజన్ పూల్‌లో సీఎన్‌ఎన్ తనకున్న షెడ్యూల్ ప్రకారం వీడియో కవరేజ్ చేయడాన్ని నిరోధించడంతో టీవీ ఛానెళ్లు ఈ నిర్ణయానికి వచ్చాయి. ఫాక్స్ న్యూస్ మీడియా, ఏబీసీ న్యూస్, సీబీఎస్ న్యూస్, సీఎన్‌ఎన్, ఎన్‌బీసీ న్యూస్ కలిసి ఇకపై రొటేటింగ్ పూల్ కవరేజ్ అందించమని ప్రకటించాయి.

 ప్రజలకు ప్రభుత్వం గురించి ఖచ్చితమైన, స్వతంత్ర సమాచారం అందాలి.  ఎలాంటి వార్తలు ఇవ్వాలి అనే కోణంలో వార్తా సంస్థను ప్రభుత్వాలు నియంత్రించకూడదు అని పేర్కొన్నారు.  

సాంప్రదాయకంగా ఈ ఐదు ప్రధాన టెలివిజన్ నెట్‌వర్క్‌లు అమెరికా అధ్యక్షుడి కవరేజ్‌ను షేర్ చేసుకుంటాయి. అధ్యక్షుడి కార్యక్రమాలకు కెమెరా క్రూ పంపే బాధ్యతను వంతులవారీగా నిర్వహించి, ఆ ఫుటేజ్‌ను ఇతర బ్రాడ్‌కాస్టర్‌లకు పంపిణీ చేస్తాయి.

 2026 సెప్టెంబర్ 21న సీఎన్‌ఎన్ పూల్ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. అందులో ట్రంప్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కోసం న్యూయార్క్ పర్యటన కవరేజ్ కూడా ఉంది. అయితే వైట్ హౌస్ ట్రంప్ విధించిన నిషేధాన్ని అమలు చేయడంతో సీఎన్‌ఎన్ ఆ అసైన్‌మెంట్‌ను నిర్వహించలేకపోయింది.