UPI మర్చంట్ ఛార్జీలపై విధించే GST కారణంగా చిన్న వ్యాపారులపై అదనపు భారం పడుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) స్పష్టం చేసింది. ఎక్స్ లో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. మెజారిటీ చిన్న వ్యాపారులు, అలాగే రూ.2వేల లోపు జరిపే లావాదేవీలు ఈ జీఎస్టీ లిమిట్ కిందకు రావని వెల్లడించింది.
అంటే రూ.2వేల కంటే ఎక్కువ మొత్తంలో జరిగే పర్సన్-టు-మర్చంట్ లావాదేవీలపై మాత్రమే ఈ MDR అలాగే జీఎస్టీ వర్తిస్తుంది. అంతకంటే తక్కువ అనగా రూ.2వేల లోపు జరిగే లావాదేవీలన్నీ యథావిధిగా పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయి. కాబట్టి వాటిపై ఎలాంటి జీఎస్‌టీ ప్రభావం ఉండదని ఎన్‌పీసీఐ తేల్చిచెప్పింది. దేశంలో జరుగుతున్న మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీలలో కేవలం రూ.2వేల లోపు లావాదేవీలే 96 శాతానికి పైగా ఉన్నాయని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అంటే దాదాపు అందరి యూపీఐ చెల్లింపులు పూర్తిగా ఫ్రీగానే ఉండొచ్చని అంటోంది. అంటే జీఎస్టీ పడకూడదు అంటే రూ.2వేలకు పైన పేమెంట్ ఉండకూడదన్నమాట.
Certain media reports have alleged that GST on UPI Merchant Discount Rate (MDR) will burden small merchants and make digital payments costly. This is incorrect. MDR applies only to P2M transactions above ₹2,000. Transactions up to ₹2,000 continue to have zero MDR and therefore zero GST impact. Government data indicates that transactions of up to ₹2,000 constitute more than 96% of UPI merchant transaction volume. As a result, the overwhelming majority of UPI payments will not attract MDR and hence no GST on MDR. Further, GST paid on MDR by a merchant will be adjusted against the GST payable on the sale of goods, in the same manner that input taxes are set off against output tax liability. Consequently, merchants do not bear the cost of GST on the MDR amount paid by them. Merchants with monthly UPI receipts of up to ₹1 lakh are not liable to pay MDR and therefore do not even have the issue of GST on MDR. Hence, apprehensions that GST on MDR will impose an additional burden on merchants are misplaced. The overwhelming majority of UPI transactions and small merchants remain unaffected. #UPI #DigitalPayments #DigitalIndia
— NPCI (@NPCI_NPCI) September 22, 2026
అలాగే వ్యాపారులు తాము చెల్లించే MDR పై పడే జీఎస్‌టీని ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ గుర్తుచేసింది. వస్తువుల అమ్మకంపై చెల్లించాల్సిన జీఎస్‌టీలో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల వ్యాపారులు ఎలాంటి జీఎస్‌టీ భారాన్ని భరించాల్సిన అవసరం రాదని స్పష్టం అంటోంది. నెలకు రూ.లక్ష వరకు యూపీఐ ద్వారా పేమెంట్స్ తీసుకునే చిన్న వ్యాపారులకు అసలు ఎండీఆర్ ఛార్జీలే వర్తించవని స్పష్టతనిచ్చింది. చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ విధానాన్ని రూపొందించినట్లు పేమెంట్స్ కార్పొరేషన్ పేర్కొంది.
