చాలా రోజుల తర్వాత.. 45 రోజుల తర్వాత లాంగ్ వీకెండ్ వచ్చింది. వరసగా సెలవులు వచ్చాయి. వీకెండ్ తో పాటు మరో రోజు సెలవు కలిసి వచ్చింది.
- ఆగస్ట్ 8వ తేదీ రెండో శనివారం
- ఆగస్ట్ 9వ తేదీ ఆదివారం
- ఆగస్ట్ 10వ తేదీ బోనాలు సెలవు. ఇది తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే సెలవు.
వీకెండ్ తోపాటు మరో రోజు సెలవు కలిసి రావటంతో.. మూడు రోజులు టూర్ ప్లాన్ చేసుకుంటున్నారు సిటీ జనం.
ఈ ఏడాది అకడమిక్ ఇయర్ లో.. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అయిన తర్వాత వస్తున్న వరస సెలవులు ఇవే. ప్రత్యేకంగా సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే చాలా ఫ్యామిలీస్ లాంగ్ వీకెండ్ హాలిడేస్ ను ఎంజాయ్ చేయటానికి వెళుతున్నారు. కొందరు గుళ్లు గోపురాలకు వెళుతుంటే.. మరి కొందరు బీచ్ ఏరియాలకు వెళుతున్నారు.
