జడ్జి ఇంట్లో నోట్ల కట్టల కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ను కొట్టివేసిన హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సిట్ లేదా సీబీఐ విచారణ జరపాల్సిందిగా నమోదైన పిటిషన్ ను హైకోర్టు 2026 సెప్టెంబర్ 21న తిరస్కరించింది.
జడ్జి ఇంట్లో లభ్యమైన అక్రమ నోట్ల కట్టల కేసు విచారణకు సంబంధించి అడ్వకేట్ ఘనశ్యామ్ ఉపధ్యాయ వేసిన పిటీషన్ ను విచారించిన జస్టిస్ అమిత్ బన్సల్.. పిటిషనర్ కు ఇంతకు మించిన ముఖ్యమైన అంశాలు దొరకలేదా అని ప్రశ్నించారు.
ఈ విషయంలో పిటిషనర్ ట్రయల్ కోర్టును ఎందుకు అప్రోచ్ కాలేకపోయారని ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ట్రయల్ కోర్టును ఎందుకు ఆశ్రయించలేకపోయారని ప్రశ్నించారు.
అయితే ఇది అసాధారణమైన కేసు అని.. దిగువ కోర్టు ఈ కేసులో న్యాయం చేయలేదని వాదించారు. అయితే ఈ పిటిషన్ ను కొట్టివేస్తామని కోర్టు చెప్పడంతో.. చట్టపరమైన పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని చెప్పి, పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఇది అంశంపై పిటిషనర్ గతంలో సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ఆగస్టులో ఇలాంటి అనుభవమే ఎదురైంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 2025 మార్చి 14న నోట్ల కట్టలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. రాత్రి 11.35 గంటల సమయంలో అగ్ని ప్రమాదంలో కట్టలు కట్టలుగా డబ్బులు బయటపడిన ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది.
