హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ) పరిధిలో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్లికేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుండగా అక్టోబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టు పేరు: మేనేజర్ (ఇంజినీరింగ్) 130. (అన్ రిజర్వ్డ్ 40, ఈడబ్ల్యూఎస్ 13, బీసీ–ఎ10, బీసీ–బి 12, బీసీ–సి 2, బీసీ–డి 8, బీసీ–ఈ 5, ఎస్సీ గ్రూప్–I 2, ఎస్సీ గ్రూప్–II 12, ఎస్సీ గ్రూప్–III 6, ఎస్టీ 13, పీడబ్ల్యూబీడీ 4, స్పోర్ట్స్ 2.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/ బీఈ/ బి.టెక్ పూర్తిచేసి ఉండాలి. మొత్తం పోస్టుల్లో సివిల్ ఇంజినీరింగ్ 80 శాతం, ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజినీరింగ్ 15 శాతం, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగాలకు 5 శాతం కేటాయించారు.
వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే 1982, జులై 2 కంటే ముందుగానీ 2008, జులై 1 తర్వాత గానీ జన్మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: సెప్టెంబర్ 23.
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ, బీసీలు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలు రూ.500 చెల్లించాలి.
లాస్ట్ డేట్: అక్టోబర్ 17.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ (తాత్కాలికం).
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.tgpsc.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు 150 మార్కులకు, పేపర్–2లో సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులకు ఇస్తారు. పేపర్–2లో సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 450 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు.
