బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. పశ్చిమానికి మధ్యలో ఆనుకుని ఉన్న వాయువ్య దిశలో 17.7° ఉత్తర అక్షాంశం.. 87.8° తూర్పు రేఖాంశం దగ్గర కేంద్రీకృతం అయిందని విశాఖ వాతావరణకేంద్రం తెలిపింది. ఇది పూరీకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో వాయుగుండంగా మారుతుంది.
గోపాలపూర్‌కు తూర్పు-ఆగ్నేయంగా 310 కి.మీ.. కళింగపట్నానికి తూర్పు-ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖపట్నానికి తూర్పున 470 కి.మీ. దూరంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ( సెప్టెంబర్ 22 నుంచి) తీవ్ర వాయుగుండంగా బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్–దక్షిణ ఒడిశా తీరాల వైపు పయనిస్తూ.. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24వ తేదీ తెల్లవారుజామున విశాఖపట్నం–గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
