Match Fixing: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ను మరోసారి ఫిక్సింగ్ భూతం కుదిపేస్తోంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్‌లో భారీ స్థాయిలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ ఓ మాజీ రంజీ క్రికెటర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మాజీ రంజీ ప్లేయర్ రచిత్ భాటియా (Rachit Bhatia) తేహెల్కా (Tehelka) నిర్వహించిన అండర్ కవర్ స్టింగ్ ఆపరేషన్‌లో తాను స్వయంగా ఫిక్సింగ్ మధ్యవర్తిగా పని చేసినట్లు ఒప్పుకున్నాడు. తేహెల్కా రిపోర్టర్‌తో రచిత్ భాటియా మాట్లాడిన వీడియో ఆధారంగా బయటపడిన వివరాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.
స్నాప్‌చాట్ ద్వారా సీఎస్కే గుట్టు రట్టు: మ్యాచ్‌కు రూ. 60 లక్షలు:
* లండన్ బుకీలతో డీల్: ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు సంబంధించిన ఇన్‌సైడ్ (అంతర్గత) సమాచారాన్ని స్నాప్‌చాట్ ద్వారా లండన్‌లోని బుకీలకు చేరవేసి 5 మ్యాచ్‌లను ఫిక్స్ చేశాను అని రచిత్ భాటియా తెలిపాడు.
* రూ. 3 కోట్ల సంపాదన: ఈ సమాచారం అందించినందుకు ఒక్కో మ్యాచ్‌కు రూ.60 లక్షల చొప్పున, ఐదు మ్యాచ్‌లకు కలిపి రూ. 3 కోట్లు అందుకున్నానని రచిత్ వెల్లడించాడు.
రేట్ కార్డు ఫిక్స్: ఐపీఎల్ నుంచి ఢిల్లీ లీగ్ వరకు:
* ప్లేయింగ్ XI లీక్: టాస్‌కు ముందే జట్టు ప్లేయింగ్ XI వివరాలను బుకీలకు అందిస్తే ఒక్కో మ్యాచ్‌కు రూ. 60 లక్షలు.
* స్పాట్ ఫిక్సింగ్: ఐపీఎల్‌లో నిర్దిష్టమైన ఓవర్‌లో లేదా బంతికి స్పాట్ ఫిక్సింగ్ చేయడానికి మ్యాచ్‌కు రూ. 1 కోటి.
* ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL): డిపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ లేదా ప్లేయింగ్ XI సమాచారం లీక్ చేయడానికి ఒక్కో మ్యాచ్‌కు రూ. 40 లక్షలు.
రంజీ బెర్త్ కోసం రూ.15 లక్షల లంచం:
అయితే గతంలో తాను చేసిన అవినీతి అక్రమాలను కూడా రచిత్ భాటియా స్టింగ్ ఆపరేషన్‌లో బయట పెట్టాడు.
* నాగాలాండ్ రంజీ టీమ్: 2018–19 రంజీ ట్రోఫీ సీజన్‌లో నాగాలాండ్ జట్టులో చోటు సంపాదించడం కోసం ఏకంగా రూ. 15 లక్షల లంచం ఇచ్చినట్లు తెలిపాడు.
* ముస్తాక్ అలీ టోర్నీలో ఫిక్సింగ్: 2018–19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్‌లో బుకీల కోసం కావాలనే రెండు వైడ్ బాల్స్ వేసి, ఒక్కో బంతికి రూ.8 లక్షల చొప్పున మొత్తం రూ. 16 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించాడు.
BCCI సమాధానం కోసం వెయిటింగ్:
ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా తమ ప్లేయర్‌ను ఒక జట్టులోకి పంపి, ప్లేయింగ్ XI లీకేజ్, స్పాట్ ఫిక్సింగ్ ప్లాన్ చేస్తున్నట్లు రచిత్ వ్యాఖ్యానించాడు. టీమిండియా, ఐపీఎల్ ఫ్రాంచైజీల ప్రతిష్టను మసకబార్చేలా ఉన్న ఈ ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీవ్రంగా స్పందించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ACU) విచారణ జరిపేందుకు రెడీ అవుతోంది.
