బీహార్‌‌‌‌‌‌‌‌ జముయిలో అమ్మాయిని ఏడిపించిన ఆకతాయి ఎన్కౌంటర్

బీహార్‌‌‌‌‌‌‌‌ జముయిలో అమ్మాయిని ఏడిపించిన ఆకతాయి ఎన్కౌంటర్

జముయి: బీహార్‌‌‌‌‌‌‌‌లోని జముయి జిల్లాలో బాలికను వేధించిన ఘటనలో ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ ఎన్కౌంటర్లో చనిపోయాడు. నందన్ యాదవ్ మంగళవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో గాయపడ్డాడని, చికిత్స కోసం అతడిని ఆసుపత్రిలో చేర్చారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నందన్ యాదవ్ కాలిని టార్గెట్ చేసి పోలీసులు కాల్చారు. నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయం తగిలింది. గాయపడిన నందన్ యాదవ్ చనిపోయాడు. యాదవ్‌ను పట్టుకునే ఆపరేషన్‌లో.. ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులను పోలీసులు ఇప్పటికైతే వివరించలేదు.

బిహార్‌‌‌‌‌‌‌‌లోని జముయి జిల్లాలో ఓ బాలుడు, బాలికను కొంతమంది ఆకతాయిలు వేధించిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌ కావడంతో పోలీసులు వెంటనే స్పందించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. స్నేహితులైన ఒక బాలుడు, బాలిక ఒకే కోచింగ్ ఇనిస్టిట్యూట్‌‌‌‌కు వెళ్తున్నారు. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం జముయి ప్రాంతంలో వారిద్దరూ రోడ్డుపై వెళ్తుండగా కొంతమంది ఆకతాయిలు వేధించి, దురుసుగా ప్రవర్తించారు. దీనిపై ఆదివారం వరకు బాధితులు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, సోమవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో  వైరల్‌‌‌‌గా మారింది.

వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్న ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో పోలీసులు బాధితులు, నిందితులను ట్రేస్ చేశారు. మహిళా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ( ఎస్‌‌‌‌డీపీఓ) దీప్తి మోనాలి నేతృత్వంలో సిట్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. జముయి పోలీస్ స్టేషన్‌‌‌‌లో పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్‌‌‌‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీడియో క్లిప్ ఆధారంగా సుమారు ఏడుగురు నిందితులను గుర్తించారు. సోమవారం ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. నందన్ యాదవ్ పోలీసుల కంటపడ్డాడు. ఎన్ కౌంటర్లో చనిపోయాడు.