India vs Japan: జపాన్‌లోని సానో ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌లో ప్రపంచ టీ20 ఛాంపియన్ భారత్‌కు ఊహించని సవాలు ఎదురైంది. వర్షం కారణంగా కేవలం 5 ఓవర్లకు (5- Over Match) కుదించిన ఈ చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను జపాన్ బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి విలవిలలాడింది. నిర్ణీత 5 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్ల నష్టానికి కేవలం 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో జపాన్ ముందు 35 పరుగుల చిన్న లక్ష్యాన్ని ఉంచింది.
14 పరుగులకే 3 వికెట్లు.. అభిషేక్ శర్మ గోల్డెన్ డకౌట్:
5 ఓవర్ల మ్యాచ్ కావడంతో తొలి బంతి నుంచే బాదుడే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత బ్యాటింగ్ లైనప్ తీవ్రంగా నిరాశపరిచింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న తొలి బంతికే అవుటై గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 7 బంతులు ఎదుర్కొని 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా ఈసారి తీవ్రంగా నిరాశపర్చాడు. కేవలం 3 రన్స్ కే మైదానం వీడాడు, దీంతో ఇండియన్ టీమ్ 14 పరుగులకే కీలకమైన 3 వికెట్లని కోల్పోయింది.
కెప్టెన్ అయ్యర్ టాప్.. జపాన్ బౌలర్ల రచ్చ:
వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్రీజ్‌లో నిలబడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. నిలకడగా ఆడుతూ భారత జట్టులో అత్యధిక (16) పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మరోవైపు టీ20 ప్రపంచ ఛాంపియన్‌పై జపాన్ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.
* చార్లీ హింజ్ మేజిక్: జపాన్ బౌలర్ చార్లీ హారా-హింజే (Charlie Hara-Hinze) అత్యుత్తమ బౌలింగ్‌తో 2 వికెట్లు తీసి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు.
* మిగతా బౌలర్ల సహకారం: బెంజమిన్ ఇటో-డేవిస్, ఇబ్రహీం తకాహాషి తలో వికెట్ పడగొట్టి భారత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
* టీ20 చరిత్రలోనే సంచలనం సృష్టించేందుకు జపాన్ జట్టుకు 5 ఓవర్లలో కేవలం 35 పరుగులు మాత్రమే అవసరమైంది. మరి శ్రేయస్ అయ్యర్ సేన తమ బౌలింగ్ నైపుణ్యంతో ఈ కొద్దిపాటి లక్ష్యాన్ని కాపాడుకుంటుందో లేక మ్యాచ్ ని జపాన్ జట్టుకి అప్పగిస్తోందో చూడాలి మరీ.
