కంటెంప్ట్ కేసులో ఐఏఎస్ అధికారి సందీప్ సుల్తానియా హైకోర్టుకు హాజరయ్యారు. సికింద్రాబాద్ కంటోన్మెమట్ బోర్డుకు చెల్లించాల్సిన నిధుల విషయంలో ఆయన కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో గతంలో సందీప్ సుల్తానియాకు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆదేశాలు పాటించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సందీప్ సుల్తానియా శనివారం (ఆగస్టు7) హైకోర్టుకు హాజరయ్యారు.
లాయర్ సుబ్రమణ్యం యాదవ్ వేసిన కంటెంప్ట్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఈ ఆదేశాలు జారి చేసింది. సికింద్రా బాద్ కంటోన్మెంట్ బోర్డు కు చెల్లించాల్సిన నిధుల విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కౌంటర్ దాఖలు చేయకుండా నిర్లక్ష్యం చేశారని సందీప్ సుల్తానియా పై ఫారం 1 నోటీసు జారీ చేసింది. రేపు (ఆగస్టు7) 10.30 గంటలకు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. కోర్టుకు హాజరు అవుతానని అండర్ టేకింగ్ ఇస్టే.. రూ. 5వేల పర్సనల్ బాండ్ పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.
