మీకు తెలుసా : సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారు.. ఎక్కడి నుంచి వస్తాయి.. ఇవి పండించే పంట కాదని తెలుసా..

మీకు తెలుసా : సగ్గు బియ్యం ఎలా తయారు చేస్తారు.. ఎక్కడి నుంచి వస్తాయి.. ఇవి పండించే పంట కాదని తెలుసా..

తెల్లని రంగులో గుండ్రంగా ఉండే సగ్గుబియ్యం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది తియ్యని పాయసం! పండుగొచ్చిందంటే చాలు.. ఇంట్లో సగ్గుబియ్యం పాయసం చేసుకుంటారు చాలామంది. కేవలం పండుగకే కాదు, మోషన్స్ అయినప్పుడు, డైజిస్టెవ్ సిస్టమ్ బాగాలేనప్పుడు కూడా సగ్గు బియ్యం తినమని చెప్తుంటారు పెద్దవాళ్లు. నోరూరించే సగ్గుబియ్యం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఆయువుపట్టు లాంటిది. ఇంతకీ ఈ సగ్గుబియ్యం ఎలా తయారవుతాయి? ఎక్కడి నుంచి వస్తాయి. వాటితో లాభాలు ఏంటి? అంటే పెద్ద కథే ఉంది!

బియ్యం అంటే వరి నుంచి నుంచి వస్తాయి. మరి సగ్గు బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి? అంటే చాలామంది వరి, గోధుమల్లాగే వీటిని కూడా పొలాల్లో పండిస్తారనుకుంటారు. కానీ, ఇది ఇండస్ట్రీలో తయారవుతుందని చాలామందికి తెలియదు. దీన్ని తయారు చేయడానికి అచ్చంగా మన గెనుసుగడ్డలా ఉండే.. టపియోకా అనే దుంప నుంచి తయారుచేస్తారు. 

టప్ యోకా అనేది పోర్చుగీసు పదం  బ్రెజిల్​ లో  నార్త్, సెంట్రల్ రీజియన్​ లో ఈ మొక్కలు ఉండేవి. పోర్చుగీసు వాళ్లు అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ విత్తనాన్ని తాము పరిపాలించిన యూరప్, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో సాగు చేయించారు. ఇందులో కేవలం కార్బోహైడ్రేట్ వ్యాల్యూ అధికంగా ఉంటుంది. చాలా తక్కువ ప్రొటీన్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. 

►ALSO READ | కళల కాణాచి.. మన హైదరాబాద్.. కళాకారుల సృజనాత్మకతకు అద్దం పడుతున్న ఆర్ట్ గ్యాలరీలు

సెంట్రల్ అమెరికాతో పాటు కొన్ని ఆఫ్రికా దేశాల్లో మనం అలుగడ్డ తిన్నంత విరివిగా వీటిని తింటారు. చాలామంది పేద వాళ్లకు అక్కడ ఇదే ప్రధాన ఆహారం! ఇతర దేశాల్లో రకరకాల ఫాస్ట్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ దీన్ని 'థెక్కింగ్ ఏజెంట్'గా వాడుతారు. అంటే సాస్​ లు , సూప్స్ లాంటివాటిలో ఈ సగ్గుబియ్యం పదార్థాలు వాడతారన్నమాట! 

మనదేశంలో కేవలం , తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే సగ్గుబియ్యాన్ని తయారు చేస్తారు. సుమారు 500 కిలోల టపియోకా గడ్డలతో కేవలం 100 కిలోల సగ్గుబియ్యం తయారవుతాయి.

లాభాలెన్నో

  • సగ్గుబియ్యంలో కాల్షియం శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి.
  • సగ్గుబియ్యంలో ఉండే పొటాషియం బీపీని అదుపు చేస్తుంది.
  • సగ్గుబియ్యంలో పిండిపదార్థం, కార్బోహై డ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తిన్న వెంటనే శరీరానికి శక్తి అందుతుంది.
  • వీటిని ప్యాక్టరీలో తయారుచేసేటప్పుడు దాదాపు ఎలాంటి కెమికల్స్ లేకుండానే తయారు చేస్తుంటారు. కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకున్నా పెద్దగా నష్టం ఏమీ ఉండదు.
  • శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సగ్గుబియ్యం సాయపడతాయి.
  • సగ్గుబియ్యం గర్భిణీలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, విటమిన్-బి కడుపులో ఉన్న బేబీ బలంగా ఎదగడానికి సాయపడుతుంది..
  • అల్జీమర్స్ వ్యాధికి సగ్గుబియ్యం ఓ అద్భుత ఔషధం, వీటిలో విటమిన్ కె అల్జీమర్స్​ ని అదుపు చేస్తుంది.
  • మోషన్స్, జ్వరం తర్వాత వచ్చే నీరసం తగ్గా అంటే సగ్గుబియ్యం జావ తాగితే ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది. సగ్గుబియ్యం జావ నీళ్ల విరోచనాలను ఆపుతుంది..