హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్ పేట్ సమీపంలో ఫ్యూచర్ సిటీలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్డింగ్ నిర్మాణ పనులను మంగళవారం (సెప్టెంబర్ 22) మంత్రి వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
స్కిల్ వర్సిటీ భవన నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించనున్నారు. కాగా, ఫ్యూచర్ సిటీలో 54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తోన్న స్కిల్ యూనివర్శిటీ భవన నిర్మాణం అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే.
