హైదరాబాద్ లో క్లౌడ్ సెంటర్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ షురూ

హైదరాబాద్ లో  క్లౌడ్ సెంటర్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ రీజియన్ షురూ

న్యూఢిల్లీ:  యూఎస్​ టెక్​ కంపెనీ మైక్రోసాఫ్ట్  ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట హైదరాబాద్​ క్లౌడ్ రీజియన్‌‌‌‌ను లాంఛనంగా ప్రారంభించింది.  ఢిల్లీలో సోమవారం జరిగిన 'మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్  సమిట్' సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను అధికారికంగా ప్రకటించారు. 

భారత్‌లో క్లౌడ్ , ఏఐ రంగాభివృద్ధికి ప్రకటించిన  20.5 బిలియన్ల డాలర్ల పెట్టుబడిలో భాగంగా ఈ డేటా సెంటర్ ఏర్పాటయింది. పుణె, చెన్నై, ముంబై తర్వాత దేశంలో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేసిన 4వ క్లౌడ్ రీజియన్ ఇది. ఆసియా , గ్లోబల్ సౌత్ ప్రాంతాలకు ఇది ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది.  

అదానీ గ్రూప్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే ఈ సేవలను వాడుతున్నాయి. దేశంలో ఏఐ మౌలిక వసతుల డిమాండ్ వేగంగా పెరుగుతోంది. భారత్‌లో 20 శాతం డేటా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కేవలం 3 శాతం డేటా సెంటర్ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉంది.