జ్యోతిష్యం: ఆశ్లేషా నక్షత్రంలో గురు సంచారం.. ఏడు రాశులవారికి అప్పులు.. కష్టాలు పరార్

జ్యోతిష్యం:  ఆశ్లేషా నక్షత్రంలో గురు సంచారం.. ఏడు రాశులవారికి అప్పులు.. కష్టాలు పరార్

దేవతలకు గురువైన గురుడు  సంపదను, శ్రేయస్సును, వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మికతను ప్రసాదిస్తాడు. జీవితాన్ని సరైన దారిలో నడిపించి మంచి స్థాయికి చేరుకునేలా చూసుకుంటాడు. ఇప్పటికే  ఆశ్లేషా నక్షత్రం  3వ పాదంలోకి ప్రవేశించిన  గురుడు అక్టోబర్ 8 వరకు గురువు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటున్నప్పటికీ   ఏడు రాశుల వారికి  (మేష, మిధునం,  కర్కాటక,  కన్య,  తుల, వృశ్చిక, మీన ) వారికి బాగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. .  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . 

మేష రాశి:  ఆశ్లేషా నక్షత్రంలో గురుడి సంచారం వలన  ఈ రాశి వారు అప్పుల సమస్యల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.  సొంతింటిని ఏర్పరచుకొనేందుకు ప్లాన్​ వేస్తారు.  ఈ రాశి వారికి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.  చేతి వృత్తుల వారికి అనుకోకుండా ఆర్డర్లు వస్తయి.  ఈ రాశి వారు గతంలో నిలిచిపోయిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. వృత్తి జీవితంలో మీ గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేస్తుంది. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు.   ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు అన్ని విషయాల్లో మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు

మిధున రాశి:  ఆశ్లేషా నక్షత్రంలో గురుడి సంచారం వలన  ఈ రాశి వారికి అదృష్టం వరించనుంది,  జీవితంలో స్థిరత్వం పొందే అవకాశం ఉంది.  ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది.  వృత్తి పరంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి.  ఏ పని చేసినా కలసి వస్తుంది. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. మొండి బాకీలు అనుకోకుండా వసూలవుతాయి.  మానసిక ప్రశాంతత లభిస్తుంది.  ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక పాత్ర పోషిస్తారు.  ప్రమోషన్​ లభించే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటకరాశి: ఆశ్లేషా నక్షత్రం 3 వ పాదంలో గుర గ్రహం సంచారం వలన ఈ రాశి వారిని అదృష్ట లక్ష్మి ప్రత్యేకంగా కరుణిస్తుందని పండితులు చెబుతున్నారు. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది.  వృత్తి పరంగా లైఫ్​ లో సక్సెస్​ సాధిస్తారు. కెరీర్​ లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతులవుతారని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది.  ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.ఇల్లు, భూములకు సంబంధించిన వివాదాలు, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.

 కన్యరాశి: ఆశ్లేషా నక్షత్రంలో గురుడి సంచారం వలన ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు.  పట్టిందల్లా బంగారమే అవుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జాబ్​ కోసం ఎదరురు చూసే వారు గుడ్​న్యూస్​ వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది.  ఆఫీసర్ల మద్దతు పుష్కలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు.  కుటుంబంలో నెలకొన్న విబేధాలు తొలగిపోయి.. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. పెళ్లి కాని వారికి కూడా మంచి సంబంధం కుదిరే ఛాన్స్ ఉంది. వైవాహిక జీవితం బాగుంటుంది. సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారని  పండితులు చెబుతున్నారు. 

  తులారాశి: గురుడు...ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారి వైవాహిక జీవితం ఆనందంగా మారుతుంది.  ఖరీదైన వస్తువులలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వృత్తి..ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది.  వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో  పురోగతి ఉంటుంది.  ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.   కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.  వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు.  కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది

 వృశ్చికరాశి : ఆశ్లేష నక్షత్రంలోసంచారం వలన ఈ రాశి వారు  ప్రత్యర్థులను అధిగమించి, పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. పాత అప్పుల నుంచి విముక్తి కల్పిస్తుంది.  కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి.  ఉద్యోగస్తులకు ... వ్యాపారస్తులకు మంచి సమయం. కేరీర్​ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు.  ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్​ పొందే అవకాశం ఉంటుంది. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి.  బిజినెస్​ చేసే వారు పెట్టే కొత్త పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

ALSO READ : వంకాయతో ఉల్లికారం.. 65 రెసిపీ .. సూపర్ టేస్ట్

 మీనరాశి: ఈ రాశి వారికి గురు గ్రహ బలం పెరుగుట వలన ఆర్థకపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.  గతంలో రావలసిన డబ్బు ఇప్పుడు చేతికి అందుతుంది. కుటుంబసమస్యలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు... వ్యాపారస్తులకు .. చేతి వృత్తుల వారికి ఆదాయం పెరుగుతుంది.  గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఫలితం పొందుతారు.  నిరుద్యోగులకు మంచి జాబ్​ ఆఫర్​ వస్తుంది.  మీరు తీసుకునే నిర్ణయం లైఫ్​ టర్నింగ్​ పాయింట్​ అవుతుంది.  గురుడు ఆశ్లేషా నక్షత్రం 3వ పాదంలో సంచరించడం వలన ఈ రాశి వారికి అన్ని సానుకూల ఫలితాలుంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.