Rainy season food: వంకాయతో ఉల్లికారం.. 65 రెసిపీ .. సూపర్ టేస్ట్

Rainy season food: వంకాయతో ఉల్లికారం.. 65 రెసిపీ .. సూపర్ టేస్ట్

వంకాయతో ఏం వండినా రుచిగానే ఉంటుంది. వెరైటీగా వండుకుని తింటే ఆరుచి మరింత పెరుగుతుంది. అందుకే రోటీన్ గా కాకుండా వెజిటెబుల్ కింగ్​తో  చేసుకునే కొన్ని వంటలు  మీకోసం. ఆల్రెడీ వంకాయ సీజన్ మొదలైంది..మరింకెందుకు ఆలస్యం.....

వంకాయ ఉల్లికారం తయారీకి కావలసినవి

  • వంకాయలు- పావు కిలో 
  • జీడిపప్పు- పావు కప్పు
  •  ఉల్లిగడ్డ తరుగు - ఒక టేబుల్ స్పూన్ 
  • శెనగపిండి- రెండు టేబుల్ స్పూన్లు 
  • కారం, ఉప్పు- తగినంత 
  • కరివేపాకు- రెండు రెమ్మలు 
  • జీలకర్ర పొడి - ఒక టీస్పూన్ 
  • చింతపండు- కొద్దిగా
  • కొత్తిమీర - కొద్దిగా 
  • వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
  • పసుపు - చిటికెడు

వంకాయ ఉల్లికారం తయారీ విధానం

ముందుగా వంకాయల్ని శుభ్రంగా కడిగి స్టఫింగ్​ కు వీలుగా కట్ చేసి నూనెలో వేగంచాలి.  ఇప్పుడు మిక్సీ జార్లో ఉల్లిగడ్డ తరుగు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉల్లికారం సిద్ధం చేయాలి. తర్వాత కొంచెం ఉల్లికారాన్ని మగ్గించిన వంకాయల్లో స్టఫ్ చేయాలి. ఇప్పుడు మిగిలిన ఉల్లికారాన్ని శెనగపిండిలో వేసి కొద్దిగా నీళ్లు పోసి కలపాలి. 

పాన్​ లో  నూనె వేడిచేసి స్టఫ్ చేసిన వంకాయలు, శెనగపిండి మిశ్రమం చేసి కాసేపు వేగించాలి. ఆపై వేగించిన జీడిపప్పు కరివేపాకులతో గార్నిష్ చేసుకుంటే వంకాయ ఉల్లికారం రెడీ

వంకాయ 65 తయారీకి కావలసినవి

  •  
  • వంకాయ ముక్కలు- ఒక కప్పు
  •  కరివేపాకు - రెండు రెమ్మలు
  •  పచ్చిమిర్చి చీలికలు - రెండు టీ స్పూన్లు 
  • ఉప్పు,కారం- తగినంత 
  • పెరుగు - అర కప్పు
  •  కొత్తిమీర- కొద్దిగా 
  • అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా- ఒక్కోటి ఒక టీ స్పూన్ చొప్పున
  • మైదా- పావుకప్పు
  • కార్ ఫ్లోర్ - ఒక టీ స్పూన్

వంకాయ 65 తయారీ విధానం

ఒక గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి జారుగా కలపాలి. వంకాయ ముక్కల్ని మిశ్రమంలో డిప్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. మరొక పాన్ కొద్దిగా నూనె వేడిచేసి కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసి వేగించాలి. 

ALSO READ : ఫ్రిజ్‌లో కాఫీ పొడి ఎందుకు పెట్టాలో తెలుసా ?

అందులో పెరుగు, ఉప్పు, ముందుగా వేగించిన వంకాయ ముక్కలు వేసి దగ్గరపడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే యమ్మీయమ్మీ వంకాయ తినడానికి రెడీ..