ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో వికృత చర్యలు..ఈసీపై సీపీఐ నేత నారాయణ ఫైర్ 

ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో వికృత చర్యలు..ఈసీపై సీపీఐ నేత నారాయణ ఫైర్ 

 హైదరాబాద్, వెలుగు: ‘ఎద్దు ఈనిందంటే మనఘాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కట్టేయండి’ అన్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వ్యవహారం తయారైందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట ఈసీ చేపడుతున్న చర్యలు అత్యంత హాస్యాస్పదంగా, వికృతంగా ఉన్నాయని, ఇవి ప్రజల్లో తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రధాని కార్యాలయం ఆడిస్తున్న సురభి నాటకంలో ఈసీ ఒక అపవిత్ర పావుగా మారడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ఓటర్ల వివరాల్లో సాంకేతిక లోపాలుంటే సరిదిద్దాలని, కానీ, ప్రముఖులకే నోటీసులు జారీ చేయడమేంటని ప్రశ్నించారు. ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు