హైదరాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో పిల్లల వార్డులో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా మరో చిన్నారి మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మరో 23 మంది చిన్నారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆదిలాబాద్ రిమ్స్ సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పిల్లల వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ పేలడంతో మంటలు చెలరేగి ఓ చిన్నారి మృతి చెందింది. వార్డులో దట్టంగా పొగ కమ్ముకుని పిల్లలు అస్వస్థతకు గురవ్వగా వెంటనే వారిని మరో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రిమ్స్‌కు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
