హైదరాబాదులో కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. దూసుకుపోతున్న గోల్డ్..!

హైదరాబాదులో కేజీకి రూ.5వేలు తగ్గిన వెండి.. దూసుకుపోతున్న గోల్డ్..!

సోమవారం భారీగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ మంగళవారం పుంజుకున్నాయి. దీంతో గడచిన కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు పెరుగుతూ తగ్గుతూ అదే స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం మంచిది. 

సెప్టెంబర్ 22న బంగారం రేట్లు పెరిగాయి. సెప్టెంబర్ 21 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా రూ.17 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 475గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 185గా కొనసాగుతోంది. 

ALSO READ : 24 గంటల ప్రసారాలతో ట్రంప్ టీవీ లాంచ్ చేసిన వైట్‌హౌస్

మంగళవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. సెప్టెంబర్ 22, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి కేజీకి రూ.5వేలు తగ్గి రేటు రూ.2లక్షల 55వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము దాదాపు రూ.255 దగ్గర ఉంది.