బాపు బొమ్మలా దీపు.. జనవరి 12 విడుదల మూవీ నుంచి కృతి ఫస్ట్ లుక్ రిలీజ్

బాపు బొమ్మలా దీపు.. జనవరి 12 విడుదల మూవీ నుంచి కృతి ఫస్ట్ లుక్ రిలీజ్

వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘జనవరి 12 విడుదల’. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌‌‌‌గా నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ట్యాగ్‌‌‌‌లైన్‌‌‌‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే  వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఫస్ట్‌‌‌‌ లుక్‌‌‌‌లను రిలీజ్ చేశారు. 

సోమవారం కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పరిచయం చేశారు. ఇందులో ‘దీపు’  క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌లో కృతి కనిపించనున్నట్టు రివీల్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌‌‌‌లో పర్పుల్-పింక్ హాఫ్ సారీలో బాపుబొమ్మాలా ట్రెడిషనల్‌‌‌‌ లుక్‌‌‌‌లో కనిపిస్తూ, అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంటోంది.   

జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్ అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌‌‌‌గా, ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.