పల్లెల్లో ఇంటి ఆవరణలో ఖాళీ స్థలాలు ఉండటం కామన్ కానీ పట్టణాల్లో ఇరుకైన ఇళ్లు.. ఖాళీ స్థలాలు లేక ఇబ్బందుల పడుతుంటారు. ఉన్న కాస్త స్థలంలోనే రసాయనిక ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో టొమాటో. వంకాయ, సొరకాయ, కాకరకాయ, బీరకాయ, నిమ్మ వంటి సాగుచే యవచ్చు.
పుదీనా, కరివేపాకు, పాలకూర, తోటకూర, ఉల్లి దాదాపు పూలకుండీల్లో పెంచుకోవచ్చు. వీటి పెంపకంలో ఇబ్బందులు ఉండవు. సాధారణంగా ఇలాంటి వాటిపైన అవగాహన ఉంటుంది. కానీఉల్లిగడ్డల పెంపకం చాలా మందికి తెలియదు. మరి మన కిచెన్ గార్డెన్ లో ఉల్లిగడ్డను ఏవిధంగా సాగుచేయా లో తెలుసుకుందాం.
ఎంపిక చేసుకొనే విధానం: మొదట మీరు ఎలాంటి ఉల్లిగడ్డలను కోరుకుంటున్నారో వాటిని ఎంపిక చేసుకోవాలి. ఉల్లిగడ్డల్లో రెడ్, వైట్, ఎల్లో ఆనియన్స్ ఉన్నాయి. వీటిలో నచ్చినవి ఎంపిక చేసుకోవాలి.
పాట్ సెలెక్షన్స్: గ్రీన్ ఆనియన్స్ పాట్స్ లేదా బాటిల్లో పెంచుకో వచ్చు. సౌకర్యాన్ని, స్థలాన్ని బట్టి పెంచుకోవచ్చు. పాట్ లో పెంపకా నికి ఎరువు అవసరం అవుతుంది..
ఎరువు తయారు చేసుకోవడం:కంపోస్ట్ చేర్చిన ఎరువును తయారు చేసుకోవడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. ఎరువును కుంపటిలో నింపి నీటిని పోయడం వల్ల మొక్కలకు మంచి హైడ్రేషన్ అందుతుంది. కుంపట్లో మొక్కలకు నీరు బాగా గ్రహించే విధంగా కుంపటి ఎంపిక ఉండాలి. లేదంటే మొక్కలు సరిగా పెరగవు.
►ALSO READ | Rainy season food: వంకాయతో ఉల్లికారం.. 65 రెసిపీ .. సూపర్ టేస్ట్
