హైదరాబాద్: డ్యాన్సర్స్ అసోసియేషన్కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ భార్య సుమలత తీరును ఎండగడుతూ ఫిల్మ్ ఫెడరేషన్ లేఖ విడుదల చేసింది.
చిరంజీవి నిర్ణయాలను, ఫెడరేషన్ నిర్ణయాలను, ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలను ధిక్కరిస్తూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని ఫిల్మ్ ఫెడరేషన్ లేఖలో తెలిపింది. సస్పెండ్ చేసినా సభ్యులను కలుపుకుపోవాలని కౌన్సిల్ సమావేశంలో అందరం నిర్ణయం తీసుకోని అవకాశం ఇచ్చామని ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది.
ఈ రోజు నుంచి ఫెడరేషన్ ఎటువంటి సహాయసహకారాలు అందించదని, అసోసియేషన్కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత తీసుకోదని ఫిల్మ్ ఫెడరేషన్ స్పష్టం చేసింది.
ఫిల్మ్ ఛాంబర్తో జరిగే వేతనాల అగ్రిమెంట్ విషయంలో ఫెడరేషన్ ఎటువంటి సపోర్ట్ చేయదని, ఫెడరేషన్ నిర్ణయంతో మిగతా 23 క్రాఫ్ట్స్ కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్కు సహాయ నిరాకరణ చేస్తారని ఫిల్మ్ ఫెడరేషన్ తేల్చి చెప్పింది.
