హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లకు (ఏఏఓ) అకౌంట్స్ ఆఫీసర్లుగా (ఏఓ) పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులివ్వడంపై అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అకౌంట్స్ విభాగంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించడంపై వీఏఓఏటీ సెక్రటరీ జనరల్ పి.అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు.
అంజయ్య ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధి బృందం జెన్‌కో సీఎండీ ఎస్.హరీశ్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందించింది. పదోన్నతులు అకౌంట్స్ అధికారుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతోపాటు విద్యుత్ సంస్థల్లో మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు దోహదపడతాయని అంజయ్య పేర్కొన్నారు.
