ఒకవేళ నేను అరెస్టయితే.. దీప్కే ప్రీ రికార్డెడ్ వీడియో రిలేజ్ చేసిన సీజేపీ

ఒకవేళ నేను అరెస్టయితే.. దీప్కే ప్రీ రికార్డెడ్ వీడియో రిలేజ్ చేసిన సీజేపీ

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రీ రికార్డెడ్ వీడియో రిలీజ్ చేసింది. ఆ పార్టీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ముందస్తుగా రికార్డు చేసిన వీడియోను 2026 అక్టోబర్ 10న రిలీజ్ చేసింది. పార్టీ కీలక నేతలు అభిజీత్ దీప్కే, అశుతోష్ రాంక, సౌరవ్ దాస్ ల అరెస్టు తర్వాత వీడియోను రిలీజ్ చేసింది.

తమను అరెస్టు చేయవచ్చునని ఊహించి వీడియో రికార్డు చేశారు దీప్కే. ఒకవేళ తాము అరెస్టయితే జంతర్ మంతర్  ఆందోళనను షిండే కొనసాగిస్తారని వీడియోలో పేర్కొన్నారు. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంక, నేను అరెస్టయితే.. షిండే లీడ్ చేస్తారని పేర్కొన్నారు. 

మా తర్వాత అజింక్యా షిండే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారు. వీడియో చూస్తున్న వాళ్లు.. అజింక్యా షిండేను ఫాలో అవ్వండి. మా తర్వాత కాక్రోచ్ జనతాపార్టీని ముందుకు తీసుకెళ్లేది షిండేనే అని చెప్పారు. 

దీప్కే, దాస్, రాంకాలను ఢిల్లీ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. చీఫ్ ఎలక్షన్ కమిషన్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ ముంబై నుంచి ఢిల్లీకి వచ్చిన నేతలను పోలీసులు అరెస్టు చేసి గుర్తు తెలియని స్థలంలో బంధించినట్లు తెలుస్తోంది.