కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత

కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత

ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఫౌండర్ అభిజిత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అభిజిత్ దీప్కే నాయనమ్మ సావిత్రిబాయి శంకర్ దీప్కే (85) మరణించారు. మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో ఉన్న తమ స్వగ్రామం సంతుక్ పింప్రిలో శనివారం (అక్టోబర్ 10) ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారం, దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో ఆమె మరణించినట్లు దీప్కే కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీప్కే నాయనమ్మ మృతిపై సీజేపీ మద్దతుదారులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ దీప్కే పోలీసుల నిర్భంధంలో ఉన్న వేళ ఈ విషాద వార్త వారి కుటుంబానికి చేరింది.  

పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే

సర్ ప్రక్రియలో అవకతవకలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ అభిజిత్ దీప్కే నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. తొలుత ముంబై, ఆ తర్వాత బెంగళూరులో సీజేపీ ఆందోళనలు నిర్వహించింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర భారీ నిరసన కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది.

ALSO READ : ఒకవేళ నేను అరెస్టయితే.. దీప్కే ప్రీ రికార్డెడ్ వీడియో రిలేజ్ చేసిన సీజేపీ

జంతర్ మంతర్ నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా దీప్కేను ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల నిర్భంధంలో ఉన్న దీప్కే నాయనమ్మ మరణ వార్త తెలియడంతో తిరిగి ఇంటికి వెళ్లి ఆమె అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. సీజేపీ భారీ నిరసన నేపథ్యంలో పోలీసులు అతడిని విడుదల చేస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.