కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ

కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ

ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపునకు సంబంధించి ఎన్నికల కమిషన్ చీఫ్ జ్ణానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసనలకు పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీకి ఇది ఎదురుదెబ్బ అని.. ఆందోళనలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయంటూ ఎగతాళి చేస్తోంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ. దేశ రాజధానిని లక్ష్యం చేసుకుంటూ.. హింసను ప్రేరేపించటానికి కాక్రోచ్ జనతా పార్టీ ముసుగులో అరాచకశక్తులు చేసిన ప్రయత్నం విఫలమైందని బీజేపీ అధికార ప్రతినిధి సందీప్ పాత్ర స్పష్టం చేశారు.

 ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసనలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. నిరసనకారులు దేశ రాజధానిని స్తంభింపజేసేందుకు, హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ నిరసనలు భారతదేశ వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం కాదని వ్యాఖ్యానించారు.  అయితే, అరాచక శక్తుల ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొన్నారు.“అరాచక శక్తుల ఫ్లాప్ షో పూర్తిగా కుప్పకూలిపోయింది. ఈ రోజు ‘భీడ్‌తంత్రం’పై ‘లోక్‌తంత్రం’ విజయం సాధించింది” అని సంబిత్ పాత్రా వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లపైనా సంబిత్ పాత్రా విమర్శలు గుప్పించారు. సీఈసీకి వ్యతిరేకంగా, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ సాగుతున్న పోరాటానికి నాయకత్వం వహించిన ఘనతను దక్కించుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయని ఆరోపించారు.అరాచక శక్తుల మధ్యే అంతర్గత అరాచకం నెలకొందని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్, ఆప్‌ల మధ్య రాజకీయ ఆధిపత్య పోరును ఎత్తిచూపారు.

ALSO READ : కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత

ఢిల్లీలో జరుగుతున్న నిరసనల్లో  కాక్రోచ్ జనతాపార్టీ నేతలను ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు.  ఈ క్రమంలో  అభిజిత్ దీప్కేను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయగా..   తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని  ఢిల్లీలో నిర్బంధించారు.  ఆమె తో పాటు  మమతా బెనర్జీతో పాటు టీఎంసీకి చెందిన  మరో ఐదుగురు నేతలను ఆమె నివాసం వెలుపల ఢిల్లీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.  ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందించిన మాజీ ఎంపీ సాకేత్ గోఖలే.. మమతా బెనర్జీతో పాటు మరో ఐదుగురిని పోలీసుల వాహనంలోకి ఎక్కించి, తమకు తెలియని ప్రాంతానికి తరలించారని ఆరోపించారు.