పళ్లబురుసు కోసం కొడుకుపై తండ్రి కేసు

పళ్లబురుసు కోసం కొడుకుపై తండ్రి కేసు

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వస్తున్న కామెడీ డ్రామా ‘పళ్లబురుసు’. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ కలిసి  నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహించాడు.  ‘బలగం’ చిత్రంలో మామ​, అల్లుడి పాత్రలతో మెప్పించిన సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇందులో తండ్రీకొడుకులుగా నటించారు.  

ఇప్పటికే పోస్టర్లు, టీజర్‌‌తో ఆసక్తి రేపిన మేకర్స్‌‌.. శుక్రవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. తనకు డాక్టర్‌‌‌‌ రాసిచ్చిన పళ్లబురుసు (టూత్‌‌ బ్రష్‌‌) కొనివ్వలేదని ఓ తండ్రి.. సొంత కొడుకుపై కోర్టులో కేసు వేయడం ఇందులో ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది. కొడుకు తనను పట్టించుకోవడం లేదని బాధపడే తండ్రి.. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కొడుకు మధ్య ఎమోషనల్‌‌ డ్రామాగా దీన్ని తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. 

 తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సరదా సంభాషణలతో ఎంటర్‌‌‌‌టైనింగ్‌‌గా సాగిన ట్రైలర్‌‌‌‌ ఆకట్టుకుంది.  ప్రజ్వల్, గోమతి రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు. ‘లవ్ స్టోరీ’ ఫేమ్ పవన్ సీహెచ్ సంగీతం అందించాడు.  ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది.