ఉస్మాన్ సాగర్ కాండ్యూట్ ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్

ఉస్మాన్ సాగర్ కాండ్యూట్  ఆధునీకరణకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఉస్మాన్ సాగర్ కాండ్యూట్​ను ఆధునీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఉస్మాన్​సార్​ నుంచి ఆసిఫ్‌‌‌‌నగర్ ఫిల్టర్ బెడ్స్ మధ్య దాదాపు 11 కి.మీ ఉన్న ఈ కాండ్యూట్​ ద్వారా రోజు 27 ఎంజీడీల రా వాటర్​సరఫరా చేస్తున్నారు. నిజాం హయాంలో నిర్మించిన ఈ కాండ్యూట్​ శిథిలావస్థకు చేరుకోవడంతో తరచూ లీకేజీలతో నీటి వృథా జరుగుతోంది. 

దీంతో కాండ్యూట్​ ఆధునికీకరించాలని వాటర్​బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి గ్రీన్​ సిగ్నల్​ ఇస్తూ శుక్రవారం జీవో.777 జారీ చేసింది. ఈ పనుల కోసం గతంలోనే రూ.282 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరైంది. టెండర్ల పరిశీలన తర్వాత ఎల్-1 బిడ్డర్‌‌‌‌గా ఎంపికైన సుధాకర ఇన్‌‌‌‌ఫ్రాటెక్ కు 4.89 శాతం అధిక ధరతో రూ.208.33 కోట్ల విలువైన కాంట్రాక్టును ప్రభుత్వం ఆమోదించింది.