హైదరాబాద్, వెలుగు: ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా బుధవారం విడుదల చేసిన సీఎంఏ ఫలితాల్లో తమ సంస్థకు చెందిన స్టూడెంట్లు జాతీయ స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించాని మాస్టర్‌మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ వెల్లడించారు. గురువారం గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు.
సీఎంఏ ఫైనల్‌లో మొదటి 10 ర్యాంకుల్లో 1, 3, 7 ర్యాంకులతోపాటు ఆలిండియా 50లోపు ర్యాంకులను 26 మంది మాస్టర్‌మైండ్స్ విద్యార్థులు సాధించారని వివరించారు. సీఎంఏ ఇంటర్‌లో మొదటి 10 ర్యాంకుల్లో 4, 8, 9 ర్యాంకులతో పాటు 25 మంది విద్యార్థులు 50లోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు. ఫైనల్, ఇంటర్ ఫలితాలు రెండింటిలోనూ కలిపి మొదటి 10 ర్యాంకుల్లో మొత్తం 6 ర్యాంకులను మాస్టర్‌మైండ్స్ విద్యార్థులే సాధించారని, మొదటి 50 ర్యాంకుల్లో ఏకంగా 51 ర్యాంకులు తమ విద్యార్థులవేనని మట్టుపల్లి పేర్కొన్నారు.
