Netflix Trending Movies: వీకెండ్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. టాప్ 10లో దూసుకెళ్తున్న మూవీస్ ఇవే!

Netflix Trending Movies: వీకెండ్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. టాప్ 10లో దూసుకెళ్తున్న మూవీస్ ఇవే!

వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ లవర్స్ కొత్త సినిమాల కోసం వెతుకుతుంటారు. సరిగ్గా ఈ వీకెండ్‌లో ఆడియన్స్‌కు మస్త్ మజా అందించేందుకు పలు కొత్త సినిమాలు, సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ సారి తెలుగు, తమిళ, హిందీ భాషలకు చెందిన రీజనల్ సినిమాల రచ్చ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్  ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చూస్తున్న ఆడియన్స్‌కు రకరకాల జోనర్లలో కొత్త సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి. రీజనల్ సినిమాల హవా నడుస్తుండగా, కామెడీ, స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'గట్ట కుస్తీ 2' నెట్‌ఫ్లిక్స్ ఇండియా చార్ట్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. మాస్ ఎమోషన్స్, సస్పెన్స్ థ్రిల్లర్లు, బాలీవుడ్, పలు డబ్బింగ్ తెలుగు సినిమాలు కూడా ఈ వారం ఓటీటీలో వ్యూవర్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ టాప్ 10 మూవీస్ ఏంటో ఓ లుక్కేద్దాం.. 

టాప్‌లో ‘గట్ట కుస్తీ 2’

నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ మూవీస్ జాబితాలో ‘గట్ట కుస్తీ 2’ మొదటి స్థానంలో నిలిచింది. కామెడీ, స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో భార్యాభర్తల మధ్య జరిగే ఫన్నీ ఈగో వార్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. హై-డోస్ కామెడీ, ఆసక్తికరమైన కథనం ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తున్నాయి.

‘కాన్ సిటీ’కి రెండో స్థానం

తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘కాన్ సిటీ’ రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సాగిపోయే ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది.

టాప్ 3లో ‘పెద్ది’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూడో స్థానంలో నిలిచింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో మాస్ అండ్ ఇంటెన్స్ ఎమోషన్స్‌తో తెరకెక్కిన ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాకు థియేటర్ల తర్వాత ఓటీటీలోనూ మంచి ఆదరణ లభిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల హవా.. 

 ఈ లిస్ట్లో బాలీవుడ్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. ‘పతీ పత్నీ ఔర్ వో 2’ రొమాంటిక్ కామెడీ జానర్‌లో ప్రేక్షకులను అలరిస్తూ టాప్ 10లో చోటు సంపాదించింది. మరోవైపు మార్వెల్ అభిమానులను ఆకట్టుకున్న ‘స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్’ కూడా ట్రెండింగ్ జాబితాలో నిలిచింది.

ALSO READ : Sr ఎన్టీఆర్‌ను అవమానించారా?.. సత్య సీన్‌పై రచ్చ

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్ లిస్ట్:

  1. గట్ట కుస్తీ 2 - తమిళ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

  2. కాన్ సిటీ - తమిళ క్రైమ్ థ్రిల్లర్

  3. పెద్ది - మాస్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా

  4. ఇక్కా - హిందీ కోర్ట్ రూమ్ థ్రిల్లర్

  5. 72 హవర్స్ - సర్వైవల్ థ్రిల్లర్ మూవీ

  6. పతీ పత్నీ ఔర్ వో 2 - హిందీ రొమాంటిక్ కామెడీ

  7. బ్లాస్ట్ - యాక్షన్ థ్రిల్లర్

  8. స్పైడర్ మ్యాన్ హోమ్‌కమింగ్ - హాలీవుడ్ సూపర్ హీరో మూవీ

  9. రావు బహదూర్ - పీరియడ్ డ్రామా

  10. దాదీ కీ షాదీ - ఫ్యామిలీ ఎంటర్టైనర్

మొత్తంగా చూస్తే.. నెట్‌ఫ్లిక్స్ ట్రెండింగ్ లిస్ట్‌లో సౌత్ సినిమాల హవా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘గట్ట కుస్తీ 2’, ‘కాన్ సిటీ’, ‘పెద్ది’ టాప్ 3లో నిలవడం విశేషం. ఏదేమైనా ఓటీటీ ప్రేక్షకులను అలరించడంలో నెట్‌ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు ముందుంటుందని మరోసారి ఈ ట్రెండింగ్ లిస్ట్ నిదర్శనంగా నిలుస్తోంది. ఇకపోతే, ప్రస్తుతం టాప్లో ఉన్న మూవీస్ స్థానాలు ప్రతిరోజు మారే అవకాశం ఉంది.