దేశ రాజధాని ఢిల్లీ.. పేరుకు తగ్గట్టు అక్కడ వసతులు ఉన్నాయా అంటే.. ఈ ఒక్క సంఘటనతో లేవు అని స్పష్టం అవుతుంది. ఇంతకీ అక్కడ జరిగిన విషయం ఏంటీ అంటారా.. ఢిల్లీలో భారీ వర్షం పడింది.. అలా ఇలా కాదు.. కుండపోత వర్షం పడింది. ఆ తర్వాత ఢిల్లీలోని చాలా ఏరియాలు నీట మునిగాయి. ఎలా అంటే.. వీధులు అన్నీ జలమయం అయ్యాయి.. స్విమ్మింగ్ పూల్ అయ్యాయి. వీధుల్లో 4, 5 అడుగుల ఎత్తులో నీళ్లు నిలిచాయి.
ఇళ్ల ముందు.. రోజు నడిచే రోడ్లు స్విమ్మింగ్ పూల్ గా మారటంతో... పిల్లలు కేరింతలు కొట్టారు. ఈత కొట్టారు. ముఖ్యంగా ఢిల్లీలోని సంఘం విహార్ ఏరియాలోని వీధులు అన్నీ మోకాలు లోతు నీళ్లలో ఉన్నాయి. కార్లు, బైక్స్ మునిగిపోయాయి. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. జనం బయటకు రావటానికి ఇబ్బంది పడ్డాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు.. ఇళ్లల్లోకి నీళ్లు రావటంతో వస్తువులు తడిచిపోయాయి.
ALSO READ : 5 స్టార్ హోటల్ లో కూరగాయలపై బూజు..
పిల్లల ఆనందానికి హద్దు లేదు. వీధుల్లోని నీళ్లల్లో ఈత కొడుతూ ఎంజాయ్ చేశారు. 2026, ఆగస్ట్ 7వ తేదీ శుక్రవారం రాత్రి పడిన వర్షానికి చాలా కాలనీల్లోని దుస్థితికి ఈ వీడియోనే సాక్ష్యం..
दिल्ली : बारिश के बाद संगम विहार की सड़कें बनीं नदियां#SangamVihar | Delhi Rain | Sangam Vihar pic.twitter.com/i6pHfhaO6Y
— News24 (@news24tvchannel) August 8, 2026
