వర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) హీరోగా, శశాంక్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎక్సైటింగ్ స్ట్రైట్ తెలుగు చిత్రం 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don’t Trouble The Trouble). విలక్షణ నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఫహాద్ ఫాజిల్ కాంబోలో, ఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్‌ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. . నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. డబ్బు వెనుక మాత్రమే పరిగెత్తే సూరి (ఫహాద్ ఫాజిల్) అనే మేజీషియన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఎప్పుడూ పైసల వేటలోనే ఉంటూ రకరకాల ఇబ్బందుల్లో పడే సూరి జీవితంలోకి ఒక చిన్న పాప (సారా పాలేకర్) ప్రవేశిస్తుంది.
ఆ పాప ద్వారా ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆమెతో కలిసి ప్రయాణం ప్రారంభించిన సూరికి ఊహించని షాక్ తగులుతుంది. ఆ చిన్నారికి కొన్ని వింతైన, మ్యాజికల్ శక్తులు ఉన్నాయని తెలిశాక కథ మొత్తం మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ఇంటర్నెట్‌లో దుమ్మురేపుతోంది
సారా, సౌరభ్ సచ్‌దేవ్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫాంటసీ, కామెడీ, థ్రిల్స్ మిళితం చేసి రాజమౌళి మార్క్ గ్రాండ్‌నెస్‌తో ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
