హైదరాబాద్‌లో లో కదలని వాహనాలు.. హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్

 హైదరాబాద్‌లో లో కదలని వాహనాలు.. హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్ రూట్లలో  భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో భారీ వర్షానికి పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  భారీగా కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లపై నీళ్లు నిలవడంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే సమయం కావడంతో  ఉద్యోగులు, ప్రయాణికులు రోడ్లపై  నరకయాతన అనుభవిస్తున్నారు. 

ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాలలో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆఫీస్ వేళ కావడంతో వేలాదిగా బయలుదేరిన వాహనాలతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో చాలా నెమ్మదిగా కదులుతున్నాయి.

సికింద్రాబాద్ నుంచి పంజాగుట్ట, అమీర్‌పేట్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, ఐమ్యాక్స్ థియేటర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

 వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.