హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్ సిటీలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

హైదరాబాద్ సిటీలో భారీ వర్షం పడుతుంది. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా సిటీ అంతా దంచి కొడుతున్న వాన. 2026 సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. ఉదయం నుంచి భగభగ అంటూ మండిన ఎండతో ఉక్కబోత ఫీల్ అయిన హైదరాబాదీలు.. సాయంత్రం వర్షంతో కూల్ అయ్యారు. చల్లటి గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో జనం హ్యాపీగా ఫీలవుతున్నారు. వర్షాకాలం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి వెదర్ చూడలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

హైదరాబాద్ సిటీలోని అసెంబ్లీ, సైఫాబాద్, లిబర్టీ, ట్యాంక్ బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి, భోలక్ పూర్, కవాడిగూడ, సైదాబాద్, ఐ ఎస్ సదన్, మలక్ పేట్, చాదర్ ఘాట్, చంపాపేట్, సంతోష్ నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, నాంపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ఏరియాల్లో భారీ వర్షం పడుతుంది. 

సాయంత్రం సమయం కావటం.. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీనికితోడు సిటీ అంతా ఆయా గల్లీల్లో గణేష్ మండపాలు ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ క్రమంలోనే సిటీ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. వర్షంతో ట్రాఫిక్ రద్దీని కంట్రోల్ చేయటం.. వాహనాలు సాఫీగా సాగటం కోసం రోడ్లపై ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ఆర్నబ్ ప్రభావంతో హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ జిల్లాల్లో రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.