తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాల పాటు తన మాస్, మెలోడీ బీట్లతో ఊపేసిన స్వరాధిపతి, దిగ్గజ సంగీత దర్శకుడు కోటి సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్రామోఫోన్ రికార్డుల కాలం నుంచి నేటి ఏఐ (AI) విప్లవం వరకు తన మ్యూజిక్ లెగసీని సగర్వంగా కొనసాగిస్తున్న ఈ మ్యూజిక్ విజార్డ్ స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 28న హైదరాబాద్‌లో అతిపెద్ద 'లైవ్ కాన్సర్ట్' జరగనుంది. మనతో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ 'కోటి 50: ది బిగ్గెస్ట్ లైవ్ కాన్సర్ట్ ఇన్ హైదరాబాద్ - ది గ్రాండెస్ట్ రోర్ ఆఫ్ హిజ్ లెగసి' పేరుతో ఈ ఈవెంట్‌ను అత్యంత ఘనంగా నిర్వహించబోతోంది.
ఈ వేడుకల పోస్టర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూగ్రామఫోన్ల రోజుల్లో కోటి గారి పాటల మోత ఇప్పటికీ నా గుండెల్లో మార్మోగుతోంది. నేటి జెన్-జీ (Gen-Z) ఆడియెన్స్‌కి ఆయన మ్యూజిక్ పవర్ ఏంటో ఈ కాన్సర్ట్ చూపిస్తుందిఅని కొనియాడారు.
సంగీత దర్శకుడు కోటి భావోద్వేగానికి లోనవుతూ.. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, నా తండ్రి సాలూరి రాజేశ్వరరావు గారి పేరును నిలబెట్టడమే లక్ష్యంగా ప్రయాణించాను. 1984 నుంచి 1994 వరకు రాజ్-కోటి కాంబో, ఆ తర్వాత నా సోలో జర్నీలో చిరంజీవి బ్రేక్ డ్యాన్సులు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ల మాస్ మ్యూజిక్ ప్రేక్షకులను ఊపేసాయి. నా దగ్గర శిష్యులుగా పనిచేసిన ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, తమన్, హారిస్ జయరాజ్ ఈరోజు గ్లోబల్ రేంజ్‌లో ఉండటం నా అదృష్టం. ఈ నవంబర్ 28న నా 50 ఏళ్ల ప్రయాణంలో నిలిచిన మ్యాజికల్ మెలోడీలను లైవ్‌లో వినిపించి రచ్చ లేపుతాంఅని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
#KOTI50 – Koti's Grand & Biggest Musical Celebration in Hyderabad.
— Telugu Film Producers Council (@tfpcin) September 22, 2026
The grand press meet for Legendary Music Director #Koti 50 Years Musical Journey was held in association with @MANATO_Team
All set for Koti’s Grand and Biggest Musical Concert on November 28th, 2026! 🎼🔥
Stay… pic.twitter.com/8yC0C6NtFl
