వెంకీ-త్రివిక్రమ్‌ల 'ఆదర్శ కుటుంబం' వాయిదా.. గాంధీ జయంతి రేసు నుంచి అవుట్.. కొత్త డేట్ ఇదే!

వెంకీ-త్రివిక్రమ్‌ల 'ఆదర్శ కుటుంబం' వాయిదా.. గాంధీ జయంతి రేసు నుంచి అవుట్.. కొత్త డేట్ ఇదే!

టాలీవుడ్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న  క్రేజీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆదర్శ కుటుంబం - హౌస్ నెం. 47' (Aadarsha Kutumbam house no 47). దసరా కానుకగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైన ఈ చిత్రం ఇప్పుడు అనూహ్యంగా వెనక్కి తగ్గింది. కొన్ని రోజులుగా సినిమా వాయిదా పడుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఊహాగానాలను నిర్మాతలు ఖండిస్తూ వచ్చినప్పటికీ.. చివరికి అభిమానులకు క్షమాపణలు చెబుతూ వాయిదా వార్తను అధికారికంగా ఖరారు చేశారు.

ప్రేక్షకులకు అనుకున్న స్థాయి కంటే బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడానికే కాస్త సమయం తీసుకుంటున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పష్టం చేశారు. దీంతో ఈ చిత్రం ముందస్తుగా ప్రకటించిన అక్టోబర్ 2 నుంచి వారం రోజులు ఆలస్యమై అక్టోబర్ 9, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తుంది. నారా రోహిత్, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి, పూజిత పొన్నాడ, రావు రమేష్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో మెరవనున్నారు.

ఇక ఈ సినిమా వాయిదాతో పాటూ విడుదల కావాల్సిన ఫస్ట్ సింగిల్ 'నారాయణమ్మ' పాట ప్రసారం కూడా వారాంతానికి వాయిదా పడింది. తమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ కాంబో దసరా బరిలో వారం రోజులు ఆలస్యంగానైనా ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.