జూరాల 32 గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదల

జూరాల 32 గేట్లు ఓపెన్.. శ్రీశైలం ప్రాజెక్టుకు నీరు విడుదల

గద్వాల, వెలుగు: జూరాల ప్రాజెక్టు దగ్గర శుక్రవారం 32 గేట్లను ఓపెన్ చేసి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి జూరాల ప్రాజెక్టుకు 2.25 లక్షల క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో 32 గేట్ల ద్వారా 2,23,168 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,444 క్యూసెక్కులు మొత్తంగా 2,57, 157 క్యూసెక్కులు వదులుతున్నారు.