కిరాణా షాపుల్లో ఇవి కూడా అమ్ముతారా..? వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు..

కిరాణా షాపుల్లో ఇవి కూడా అమ్ముతారా..? వరంగల్ జిల్లాలో ఎక్సైజ్ అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు..

వరంగల్ జిల్లాలో ఎక్సైజ్, ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. శనివారం ( ఆగస్టు 8 ) జరిగిన ఈ దాడులకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని పలు కిరాణా షాపుల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. ఈ దాడుల్లో గుడుంబా తయారీలో వాడే కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

నర్సంపేట మండలంలోని శ్రీ వెంకటేశ్వర కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ లో కెమికల్స్ అమ్మకాలపై సమాచారం అందుకున్న అధికారులు ఇవాళ ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీలో వాడే కెమికల్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. కిరాణా స్టోర్ యజమాని పుట్టరామస్వామిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కెమికల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఎవరెవరికి విక్రయించాడు వంటి వివరాలు ఆరా తీస్తున్నారు పోలీసులు.