గెలిచినా తిడతారు.. ఓడినా తిడతారు.. ఆడినా తిడతారు.. ఆడకపోయినా తిడతారు.. పాకిస్తాన్ జట్టు దుస్తితి ఇలా ఉంది. టీ 20 వరల్డ్ కప్ ఫస్ట్ డే.. గ్రూప్ ఏలో ఉన్న పాక్ జట్టు.. ఫస్ట్ మ్యాచ్ గా నెదర్లాండ్స్ టీంపై ఆడింది. పాకిస్తాన్ గెలిచింది. గెలిస్తే సంబరాలు చేసుకోవాలి కదా.. మరి తిడతారు ఏంటీ అంటారు.. అక్కడికే వస్తున్నాం..
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది.
ఆ తర్వాత 148 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగింది పాకిస్తాన్.
నెదర్లాండ్స్ జట్టు.. పిల్ల బచ్చా టీం.. క్రికెట్లో పిల్లకూన జట్టు..
పాకిస్తాన్ ఏమో పెద్ద పులి లెక్క ఫీలయ్యారు పాక్ ఫ్యాన్స్..
గ్రౌండ్లో సీన్ రివర్స్ అయ్యింది..
పాకిస్తాన్ జట్టు.. 148 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయటానికి ఏకంగా 20 ఓవర్ల 3 బంతులు తీసుకుంది.
అంటే జస్ట్ మూడు బంతులు మిగిలి ఉండగా.. టార్గెట్ ఛేజ్ చేసి గెలిచింది.
ఇక్కడే పాకిస్తాన్ జనం.. పాక్ క్రికెట్ అభిమానులు రగిలిపోయారు..
పిల్లకూన నెదర్లాండ్స్ .. 148 పరుగుల టార్గెట్ ఛేజ్ చేయటానికి 19 ఓవర్లు తీసుకోవటం ఏంటీ.. అంటే చచ్చీచెడీ.. కష్టపడి గెలవటం ఏంటీ... నెదర్లాండ్స్ బౌలర్లు అంతలా పాక్ జట్టును వణికించారా.. ఇలా అయితే మిగతా జట్లతో ఇంకేం ఆడతారు.. అంటూ తిట్టిపోస్తున్నారు పాకిస్తాన్ జనం.. ఫ్యాన్స్..
T20 World Cup 2026లో పాకిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. నెదర్లాండ్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. నెదర్లాండ్స్ జట్టును 19.5 ఓవర్లలో 147 పరుగులకు కట్టడి చేసింది. నెదర్లాండ్స్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి పాక్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లకే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.
Also Read : మనిషివా..? హెట్ మెయిర్వా..? స్కాట్లాండ్ ముందు గట్టి టార్గెట్
పాక్ బ్యాటర్లలో ఫర్హాన్ 47 పరుగులతో రాణించాడు. ఫహీమ్ అస్రఫ్ 29 (నాటౌట్), అయూబ్ 24, బాబర్ అజమ్ 15, సల్మాన్ అఘా 12, మహ్మద్ నవాజ్ 6, షాహిద్ అఫ్రీదీ 5 (నాటౌట్)గా నిలిచారు. నెదర్లాండ్స్ బ్యాటర్లలో స్కాట్ ఎడ్వర్డ్ 37, బాస్ డి లీడే 30, మైకేల్ లెవిట్ 24, ఆర్యన్ దత్ 13 పరుగులు చేశారు.
పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జాకు 3 వికెట్లు, మహ్మద్ నవాజ్ 2, అబ్రార్ అహ్మద్ 2, అయూబ్ 2, అఫ్రీదీకి ఒక వికెట్ దక్కింది. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ 2, పాల్ వాన్ మికరెన్కు 2, వాన్ బీక్, కైల్ క్లెన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వేకు తలో వికెట్ దక్కింది.
Seriously? This Pakistan team thinks that WC is incomplete without them? 2 kaudi ki team Pakistan.#PAKvsNED
— Vinayak Dubey 🇮🇳 (@vinayvaani) February 7, 2026
Babar another stinker on world stage which almost costed pak against netherlands of all
— . (@finehaihum) February 7, 2026
How he is still a cult figure in pak is mystery
