West Indies vs Scotland: మనిషివా..? హెట్ మెయిర్వా..? స్కాట్లాండ్ ముందు గట్టి టార్గెట్

West Indies vs Scotland: మనిషివా..? హెట్ మెయిర్వా..? స్కాట్లాండ్ ముందు గట్టి టార్గెట్

టీ20 వరల్డ్ కప్ 2026 సందడి మొదలైంది. వెస్టిండీస్, స్కాట్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. స్కాట్లాండ్ ముందు 183 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వెస్టిండీస్ హిట్టర్ హెట్ మెయిర్ స్కాంట్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆరు సిక్సులు, రెండు ఫోర్లతో 36 బంతుల్లో 64 పరుగులు బాదేశాడు. 

స్కాట్లాండ్ బౌలర్ షరీఫ్ బౌలింగ్లో ఫుల్ టాస్ను ఊర మాస్గా హెట్ మెయిర్ షాట్ కొట్టాడు. అయితే.. ఆ షాట్ను బ్రాండన్ మెక్ ముల్లెన్ అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టడంతో హెట్ మెయిర్ పెవిలియన్ బాట పట్టక తప్పలేదు. ఆ తర్వాత బంతికే రూథర్ ఫర్డ్ కూడా షాట్కు యత్నించి క్యాచ్గా దొరికిపోయాడు. బ్రాడన్ కింగ్ 35 పరుగులు, పావెల్ 24 పరుగులు, షై హోప్ 19 పరుగులు చేశారు. స్కాట్లాండ్ బౌలర్లలో బ్రాడ్లీ క్యూరీ 2 వికెట్లతో రాణించాడు. షరీఫ్, ఒలివర్ డేవిడ్ సన్, మైఖెల్ అలెగ్జాండర్ లీస్క్ తలో వికెట్ తీశారు.

ALSO READ : అమెరికాను తక్కువ అంచనా వేయలేం..

ఇదిలా ఉండగా.. T20 World Cup 2026లో పాకిస్తాన్ జట్టు బోణీ కొట్టింది. నెదర్లాండ్స్పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్.. నెదర్లాండ్స్ జట్టును 19.5 ఓవర్లలో 147 పరుగులకు కట్టడి చేసింది. నెదర్లాండ్స్ జట్టు ఏడు వికెట్లు నష్టపోయి పాక్ ముందు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. పాకిస్తాన్ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 19.3 ఓవర్లకే 148 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. 

ఇక.. టీమిండియా విషయానికొస్తే.. వాంఖడే స్టేడియంలో అమెరికాతో జరిగే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఇండియా తలపడనుంది. అమెరికా జట్టులో చాలా మంది మన దేశ మూలాలున్న ఆటగాళ్లే ఉండటం కొస మెరుపు. ఒక రకంగా అది మినీ ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపిస్తుందని స్పోర్ట్స్ అనలిస్టులు అభిప్రాయపడ్డారు. ముంబైకి చెందిన సౌరభ్ నేత్రావల్కర్, హర్మీత్ సింగ్, శుభమ్ రంజనే ఇప్పుడు అమెరికా జెర్సీలో తమ సొంత మైదానంలో బరిలోకి దిగనున్నారు.