అమెరికాపై మాస్ ఫర్మామెన్స్: టీ20ల్లో కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య భాయ్

అమెరికాపై మాస్ ఫర్మామెన్స్: టీ20ల్లో కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన సూర్య భాయ్

ముంబై: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచులో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దుమ్మురేపాడు. పవర్ ప్లేలోనే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ కెప్టెన్ ఇన్సింగ్స్‎తో జట్టును ఆదుకున్నాడు. చివరి వరకు క్రీజులో ఉండి అజేయ హాఫ్ సెంచరీ (85)తో టీమిండియాకు ఘన విజయం అందించాడు. ఈ వీరోచిత పోరాటానికి గానూ సూర్య మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికయ్యాడు.

టీ20ల్లో సూర్యకు ఇది 17వ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్. తద్వారా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డ్‎ను బద్దలు కొట్టాడు స్కై. భారత్ తరుఫున టీ20 ఫార్మాట్‎లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు (16) అందుకున్న రికార్డ్ ఇప్పటి వరకు కోహ్లీ, సూర్య పేరిట సంయుక్తంగా ఉండేది. అమెరికాతో జరిగిన మ్యాచులో మ్యా్న్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుని కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేశాడు సూర్య. 

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పేరున్న హిట్టర్లంతా తడబడిన వేళ  కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్  ముందుండి నడిపించడంతో టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా శుభారంభం చేసింది. తొలి రోజు శనివారం (ఫిబ్రవరి 7) జరిగిన గ్రూప్‌‌‌‌‌‌‌‌–ఎ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో 29  రన్స్ తేడాతో అమెరికాను ఓడించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన ఇండియా 20 ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. కెప్టెన్ సూర్యకు తోడు తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించారు. 

అమెరికా బౌలర్లలో షాడ్లీ వాన్ షాల్క్‌‌‌‌‌‌‌‌విక్ (4/25) సత్తా చాటాడు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో యూఎస్ టీమ్ 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసి ఓడింది. సంజయ్ కృష్ణమూర్తి (37), శుభం రంజనే (37), మిలింద్ కుమార్ (34) పోరాడారు. అర్ష్‌‌‌‌‌‌‌‌దీప్, అక్షర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూర్య  ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్‌‌‌‌గా నిలిచాడు.  ఈ నెల 12న ఢిల్లీలో జరిగే తమ తర్వాతి మ్యాచ్‌‌‌‌లో నమీబియాతో ఇండియా పోటీ పడనుంది. 

భారతదేశం తరపున T20I లలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు:

17 సూర్యకుమార్ యాదవ్

16 విరాట్ కోహ్లీ

14 రోహిత్ శర్మ

8 అక్షర్ పటేల్