తెలంగాణ రైతులకు IMD షాక్... ఆ రకం వరి సాగు చేయొద్దంటూ వార్నింగ్..

తెలంగాణ రైతులకు IMD షాక్... ఆ రకం వరి సాగు చేయొద్దంటూ వార్నింగ్..

తెలంగాణ రైతాంగానికి షాక్ ఇచ్చింది IMD. ఈ ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ సోనా ( RNR 15048 ) రకాన్ని సాగు చేయొద్దని హెచ్చరించింది IMD. ఇప్పటిదాకా కురిసిన వర్షపాతాన్ని దృష్టిలో ఉంచుకొని జూన్ నెలలో RNR 15048 రకాన్ని సాగు చేయొద్దని హెచ్చరించింది. ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు ఏడు రకాల నాణ్యమైన వరి పండించాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించగా వాటిలో ఈ రకాన్ని సాగు చేయొద్దని సూచించింది IMD.

RNR 15048 రకానికి బదులుగా రైతులు పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర, మినుములు, ఆముదం వంటి వర్షాధార పంటలను సాగు చేయాలని పేర్కొంది వాతావరణ శాఖ.

తేలికపాటి నేలల్లో ఒక వారంలో 50-60 మిల్లీమీటర్లు, బరువైన నేలల్లో 60-75 మిల్లీమీటర్ల మొత్తం వర్షపాతం నమోదైన తర్వాత, వర్షపు నీటి పైభాగంలోని 15 నుండి 20 సెంటీమీటర్ల మట్టి తడిసి, ఆ తడిగానే ఉన్నప్పుడు మాత్రమే వరి సాగు చేపట్టాలని ఐఎండి తెలిపింది.

►ALSO READ | జగిత్యాల జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం... ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం...