ప్రయాణికులకు అలర్ట్: తిరుపతికి వెళ్లే.. ఈ రైళ్ల కొత్త టైమింగ్స్, రూట్ ఇవే..!

ప్రయాణికులకు అలర్ట్: తిరుపతికి వెళ్లే.. ఈ రైళ్ల కొత్త టైమింగ్స్, రూట్ ఇవే..!

తిరుపతికి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ రైళ్ల టైమింగ్స్  ప్రకటన చేసింది రైల్వే శాఖ. భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో తిరుపతికి వెళ్లే రైళ్ల సంఖ్యను పెంచిన సంగతి తెలిసిందే. గతంలో వీక్లీ నడిచే రైళ్లను కొన్నిటిని రెగ్యులర్ చేసిన రైల్వే శాఖ ఇప్పుడు పలు రైళ్ల టైమింగ్స్ మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే కొత్త రైళ్లు ప్రకటిస్తున్న క్రమంలో తిరుపతికి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల టైమింగ్స్ మార్చింది రైల్వే శాఖ.

ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్‌ వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12761) ప్రస్తుతం ప్రతి బుధ, శనివారాల్లో రాత్రి 8:05 గంటలకు బయలుదేరుతుండగా.. అక్టోబర్ 10 నుంచి రాత్రి 7:50 గంటలకు బయల్దేరనున్నట్లు తెలిపారు అధికారులు. 

ప్రస్తుతం  సమయానికంటే 15 నిమిషాలు ముందుగా బయలుదేరుతుందని వెల్లడించారు అధికారులు. ప్రయాణికులు ఈ మార్పును గమనించి రిజర్వేషన్ చేసుకోవాలని సూచించారు అధికారులు.

ఇదిలా ఉండగా... తెలుగు రాష్ట్రాలకు కొత్తగా రెండు వండేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది రైల్వే శాఖ. అందులో భాగంగా విశాఖ నుంచి బెంగుళూరుకు వందే భారత్ స్లీపర్ షెడ్యూల్ కూడా ఖరారు చేశారు అధికారులు. దీంతో పాటు సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీకి మరో వండేభారత్ స్లీపర్ కేటాయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.